The secret of men : పురుషులు తరచుగా దాచే రహస్యాలివే.. భాగస్వామి ముందు కూడా బయటపడరు!

మా ఆయన అలాంటి వాడు కాదని, ఏ విషయాన్నీ దాచుకోడని, ఎంత సీక్రెట్(secret) అయినా తనతో చెప్పేస్తుంటాడని చాలామంది మహిళలు భావిస్తుంటారు. కానీ..

Update: 2024-09-04 12:53 GMT

దిశ, ఫీచర్స్ : మా ఆయన అలాంటి వాడు కాదని, ఏ విషయాన్నీ దాచుకోడని, ఎంత సీక్రెట్(secret) అయినా తనతో చెప్పేస్తుంటాడని చాలామంది మహిళలు భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదంటున్నారు మానసిక నిపుణులు. పురుషులు కూడా తమ పార్ట్‌నర్ వద్దు పంచుకోని రహస్యాలు ఉంటాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

టెన్షన్‌లో ఉన్నా సరే..

ఒత్తిడి, టెన్షన్ (tension) వంటివి ఎదుర్కొంటున్నప్పటికీ పురుషుడు భార్య లేదా ప్రియురాలి ముందు దానిని ప్రదర్శించడు. చాలామంది కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒత్తిడికి గురవుతుంటారు. కానీ భార్యముందు మాత్రం పెద్ద సమస్యేం కాదు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. తాము స్ట్రెస్ (Stress)ఎదుర్కొంటున్న విషయం చెప్పరు.

బోరున ఏడ్వలేరు

మహిళలు తమకు ఏ కష్టం వచ్చినా.. మనసులో బాధగా అనిపించినా భర్తతో, సన్నిహితులతో చెప్పుకొని బోరున ఏడ్చేస్తారు (They cry in the hole). కన్నీళ్లు కారుస్తారు. కానీ పురుషులు ఇలా చేయలేరు. తన భార్య ముందు అయినా సరే భర్త తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం చాలా అరుదు. మనసులో బాధగా ఉన్న గాంభీర్యంగా బిహేవ్ చేస్తుంటారు. కానీ ఎవరూ లేనప్పుడు తమలో తాము చాలా బాధ పడతారు. అవసరమైతే ఏడుస్తారు. ఆడవాళ్ల ముందు ఏడుస్తావేంటి అని ఎవరైనా ఎగతాళి చేస్తారేమోననే భావంతో చాలామంది పురుషులు మహిళల ముందు బాధ అనిపించినా కన్నీరు పెట్టుకోరు.

సోషల్ మీడియా గురించి

పురుషులు సోషల్ మీడియా(Social media)లో ఏం చేస్తున్నది, తాము ఎవరిని ఫాలో అవుతున్నది, తమను ఎవరు ఫాలో అవుతున్నారు తదితర విషయాలను భార్యతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరట. అమ్మాయిలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియా అకౌంట్లను, మహిళలు తమ భర్త సోషల్ మీడియా స్టేటస్‌లను వారికి తెలియకుండానే చెక్ చేస్తుంటారని, తెలిసి కూడా చెక్ చేస్తుంటారని చెప్తారు.

అమ్మాయిలను చూసినప్పుడు..

మా ఆయన లేదా నా ఫ్రెండ్ మహిళలవైపు కన్నెత్తి కూడా చూడడు అని కొందరు అంటుంటారు. కానీ ఇది చాలా వరకు అబద్దం. పెళ్లైనా, కాకున్నా బయట తిరుగుతున్నప్పుడు, ఆయా సందర్భాల్లో అందమైన అమ్మాయిలు కనిపిస్తే పురుషులు అట్రాక్ట్ అయిపోయి (Attractive to womans) వారివైపు చూసేస్తుంటారు. అలాగని ప్రతీ చూపులో చెడు ఉద్దేశం ఉంటుందని కాదు కానీ.. ఇక్కడ ఆకర్షణ సహజంగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 


Similar News