పెరుగుతున్న బ్రొమాన్స్.. క్లోజ్ ఫ్రెండ్‌షిప్ మెయింటెన్ చేస్తున్న మగాళ్లు
మగాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ ఎలాంటి భావోద్వేగాలు లేని, పోటీతత్వం కలిగినదిగా భావిస్తుంది సమాజం. అందుకే చాలా మంది పురుషులు గొప్ప స్నేహితులుగా ఉండలేరని, స్నేహం వారికో ప్రాబ్లమ్ అని పరిగణించబడుతుంది.
దిశ, ఫీచర్స్ : మగాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ ఎలాంటి భావోద్వేగాలు లేని, పోటీతత్వం కలిగినదిగా భావిస్తుంది సమాజం. అందుకే చాలా మంది పురుషులు గొప్ప స్నేహితులుగా ఉండలేరని, స్నేహం వారికో ప్రాబ్లమ్ అని పరిగణించబడుతుంది. లో క్వాలిటీ ఫ్రెండ్‌షిప్ వల్లే స్త్రీలతో సాన్నిహిత్యానికి మొగ్గుచూపుతారని.. అలాంటివి కూడా లేని సందర్భాల్లో ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పబడుతుంది. అంతేకాదు కొంతమంది పురుషుల స్నేహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపితే.. మరికొంత మంది అసలు అలాంటి ఫ్రెండ్స్ వద్దని తేల్చేస్తారు. అయితే ఇదంతా మహిళలతో పోలిస్తే పురుషుల భావవ్యక్తీకరణ తక్కువగా ఉండటం వల్ల వచ్చిన సమస్య అంటున్నారు నిపుణులు. ఇతర వ్యక్తులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని పరిశీలిస్తే.. మేల్ ఫ్రెండ్‌షిప్ హార్ట్ రిథమ్‌ను చూడగలుగుతామని అంటున్నారు. కోడెడ్ మార్గాల్లో నిశ్శబ్ద సాన్నిహిత్యాన్ని పంచుకునే ‘బ్రొమాన్స్’ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? ఎంత గొప్పగా ఎఫెక్ట్ చూపుతుంది? అని వివరిస్తున్నారు.
హ్యూమర్ ఒక ఎగ్జాంపుల్
సాధారణంగా ఆడవాళ్ల మధ్య స్నేహం స్ట్రాంగ్‌గా ఉంటుందని నమ్ముతాం. కానీ బాధ్యతలు, కీలక విషయాల్లో మగవారి స్నేహమే ఎక్కువ మద్దతిస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతెందుకు ఇద్దరు మేల్ క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇతరులకు అయోమయంగా ఉంటుంది. వారు దేని గురించి సంభాషిస్తున్నారో కూడా అర్థం కానీ పరిస్థితి తలెత్తుతుంది. ప్రొవోకేటివ్ నిక్ నేమ్స్ యూజ్ చేయడం.. అందులో నుంచి వారికి మాత్రమే అర్థమయ్యే హాస్యాన్ని తీసుకురావడం, పగలబడి నవ్వుకోవడం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు చూసుకున్నా నవ్వుకుంటారు. అంటే ఒకే టైమ్‌లో, ఒకే విషయం గురించి ఆలోచించే విధానం, బ్రెయిన్ అండ్ మూడ్ వారిని అంత స్ట్రాంగ్‌గా కనెక్ట్ చేస్తుంటుంది. భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పంచుతుంది. ఇది మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌కు కారణమవుతుంది.
పురుషాధిక్యతను ప్రతిఘటించడం
చాలా మంది మగాళ్లు సమాజం తమకు అందించిన పురుషాధిక్యతను అణిచివేయడంలో ఇబ్బంది పడుతుంటారు. బలహీనతలను వ్యక్తపరచడానికి, లోతైన సంబంధాలను ఏర్పరచడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ చేస్తే తిరస్కరణ, అవమానానికి గురవుతారని భయపడుతారు. అలాంటప్పుడే మద్యం, మాదకద్రవ్యాలకు బానిస అవుతారు. ఈ సమయంలోనే మత్తులో మరో మగాడితో తమ బాధలను పంచుకుంటారు. ఈ వ్యక్తీకరణ అనేది మేల్స్ క్లోజ్ ఫ్రెండ్‌షిప్‌కు కారణమవుతుంది. అపహాస్యం చేయని స్టాగ్ పార్టీల్లోనే భావోద్వేగ సాన్నిహిత్యం సాధ్యమవుతుంది.
హెల్తీ బ్రొమాన్స్
‘బ్రొమాన్స్’ అనేది ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. 1990లలో స్కేట్ బోర్డింగ్ నుంచి ఉద్భవించింది ఈ పదం. టూర్‌లో ఉన్నప్పుడు పురుషులు హోటల్ గదులను పంచుకునేవారని, ఈ టైమ్‌లో వారి మధ్య బలమైన బంధం ఏర్పడేదని చెప్తున్నారు. ‘ఐ లవ్ యు, మ్యాన్’ వంటి కోట్స్ ద్వారా ఒకరినొకరు లవ్ ఎక్స్‌ప్రెస్ చేసుకునేవారని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఇద్దరు మగాళ్లు సన్నిహితంగా ఉంటే స్వలింగ సంపర్కం చుట్టూ ఉన్న నెగెటివిటీతో జడ్జ్ చేయబడతామని భావించేవారు. కానీ అలాంటిదిప్పుడు లేదు కాబట్టి లైంగిక లేదా లైంగికేతర పురుషులతో సాన్నిహిత్యం కలిగి ఉండొచ్చు. ఇలాంటి బ్రొమాన్స్ ఉన్నత స్థాయి సాన్నిహిత్యం, మద్దతును అందించగలదు. నమ్మకం, దుర్బలత్వం, ఆప్యాయతను పంచగలదు. బ్రొమాన్స్ అధ్యయనంలో పురుషులు.. ‘నేను అతన్ని కౌగిలించుకుంటాను. ముద్దు పెట్టుకుంటాను. ప్రేమిస్తున్నాను’, ‘అతనితో రహస్యాలు, బాధలను పంచుకోవచ్చు. ప్రేమించవచ్చు. కానీ ఎలాంటి లైంగిక ఆకర్షణ లేదు’, ‘అతనికి ఏమి చెప్పినా పర్వాలేదు. వినడానికి ఎల్లప్పుడూ నా కోసం ఉంటాడు’ అని మరొక పురుషునితో ఉన్న బంధం గురించి చాలా విధాలుగా ఎక్స్‌ప్రెస్ చేశారు.
మేల్ ఫ్రెండ్‌షిప్ లెవలింగ్ అప్
‘యుక్తవయస్సులో పురుషులు ఫ్రెండ్‌షిప్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు’ అని పరిశోధనలు చెబుతున్నాయి. పురుషాధిక్య నియమాల గురించి చర్చించడంలో నిష్ణాతులుగా ఉన్నారని వివరిస్తున్నాయి. అయితే సురక్షితమైన సందర్భాలలో మాత్రమే తమ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ అవుతున్నారని, పురుషులందరికీ ఇలాంటి ప్రదేశాలు లేవని గుర్తించాయి. అందుకే యువకులు ఇలాంటి సేఫ్ జోన్స్ క్రియేట్ చేసుకోవడం కీలకం అంటున్న నిపుణులు.. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ప్రారంభించినప్పుడే పురుష బంధం బలంగా మారుతుందని, సంభాషణలు సహజంగా ఉద్భవిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లైనా మీ లవర్ మీ కలలోకి వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి?