అశ్లీల చిత్రాలు చూస్తున్న పురుషులు.. తమను తాము ఆ వీడియోల్లో ఊహించుకుంటూ..

పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన పురుషులు ఈటింగ్ డిజార్డర్స్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది తాజా అధ్యయనం.

Update: 2023-06-17 12:25 GMT

దిశ, ఫీచర్స్: పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన పురుషులు ఈటింగ్ డిజార్డర్స్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది తాజా అధ్యయనం. పోర్న్‌లో పాల్గొన్న వ్యక్తులతో తమ శరీరాకృతిని పోల్చుకుంటూ ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారని.. ఫుడ్ విషయంలో తమను తాము రిస్ట్రిక్ట్ చేసుకుంటారని, లేదంటే అతిగా తినేస్తారని తెలిపింది. దీంతో పూర్తిగా కుంగిపోతున్నారని, ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వివరించింది.

యూనివర్శిటీ ఆఫ్ హైఫా అండ్ ఇజ్రాయెల్‌లోని ది మాక్స్ స్టెర్న్ యెజ్రీల్ వ్యాలీ కాలేజీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 18-68 సంవత్సరాల వయస్సు గల 705 మంది ఇజ్రాయెల్ పురుషులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. కాగా, అశ్లీల వీడియోలను చూస్తున్నప్పుడు.. ఆందోళన, నిరాశతో పాటు లైంగిక పనితీరు సమస్యలు, హైపర్ సెక్సువాలిటీ, మానసిక ఆరోగ్యం వంటి అంశాల్లో ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నారని తేలింది. పోర్న్ తమ జీవితంలో ముఖ్యమైన భాగంగా భావిస్తున్న వారు.. చూడకుండా నిరోధిస్తే స్ట్రెస్‌కు లోనవుతున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా US వయోజన జనాభాలో దాదాపు మూడు నుంచి ఆరు శాతం మంది సమస్యాత్మకమైన అశ్లీల వ్యసనానికి అలవాటు పడగా.. 65 శాతం మంది యువకులు, 18 శాతం మంది యువతులు కనీసం వారానికి ఒకసారి అశ్లీల చిత్రాలను చూస్తున్నారని నివేదించారు.

ఇవి కూడా చదవండి: సెక్స్ సమ్మతి వయస్సు 16 ఏళ్లకు పెంచుతూ కొత్త చట్టం..


Similar News