మ్యాజిక్‌తో క్లైమేట్‌కి మంచి.. మేగాన్ స్వాన్ వినూత్న ప్ర‌య‌త్నం! (వీడియో)

మెజీషియ‌న్‌ మేగాన్ స్వాన్ స‌రికొత్త ఉపాయాన్ని ఆలోచించింది. Megan Swann is a trail-blazing female magician.

Update: 2022-06-11 10:36 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భూమిపైన కాలుష్యం క‌ర్క‌శంగా మారుతోంది. స‌మ‌యం లేదు మిత్ర‌మా.. అంటూ మ‌రోవైపు ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ స‌మాజానికి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక మంది సెల‌బ్రిటీలు, వ్య‌క్తులు ముందుకొచ్చి ప‌ర్యావ‌ర‌ణ మార్పుపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. భూతాపాన్ని పెర‌గ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే యూర‌ప్‌కు చెందిన మెజీషియ‌న్‌ మేగాన్ స్వాన్ స‌రికొత్త ఉపాయాన్ని ఆలోచించింది. త‌న మ్యాజిక్‌తో ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిశ్చ‌యించుకుంది.

ఆమె 1992లో జన్మించింది. పురుష-ఆధిపత్యంలో ఉన్న మ్యాజిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టాల‌ని అనుకుంది. సరిగ్గా అదే కాలంలో యూర‌ప్‌లోని 'మేజిక్ సర్కిల్ మెజీషియ‌న్స్ సొసైటీ'లో చేరడానికి మహిళలను అనుమతించడం ప్రారంభించింది. ఇప్పుడు 30 ఏళ్ల వయస్సులో, స్వాన్ ఆ సొసైటీకి అతి పిన్న వయస్కురాలైన‌ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక‌య్యింది. అది మాత్రమే కాదు, క్లైమేట్ ఛేంజ్‌, పర్యావరణం గురించి అవగాహన పెంచడానికి స్వాన్‌ తన మ్యాజిక్‌ని వినియోగిస్తోంది. స్వాన్‌ వన్యప్రాణుల పరిరక్షణ గురించి యూనివ‌ర్సిటీలో అధ్యయనం చేసింది. ఈ క్ర‌మంలోనే వాత‌వ‌ర‌ణ మార్పు అంశంలో ఆమె త‌న ఇంద్ర‌జాలాన్ని ఉప‌యోగించాల‌ని నిర్ణ‌యించుకుంది.

త‌న మాట‌ల్లోనే వింటే, "నేను మ్యాజిక్‌ని కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగిస్తాను. ఇది ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆకర్షించడానికి, మ‌నం ఇవ్వాల‌నుకుంటున్న‌ సందేశాన్ని సరదాగా అంద‌రితో పంచుకోవడానికి ఒక మార్గం" అని చెబుతుంది. ఐదేళ్ల‌ వయస్సులో తన మొదటి మ్యాజిక్ సెట్‌ను బ‌హుమ‌తిగా పొందిన స్వాన్.. మొక్కలు, జంతువులు, కీటకాలను సూచించే మూడు తాడులతో చేసే మ్యాజిక్‌ తనకు ఇష్టమైన ట్రిక్స్‌లో ఒకటి అని అంటుంది. 


Similar News