ఈ సోలార్ ప‌వ‌ర్ కారుకు ఫిదా అయిన ఆనంద్ మ‌హీంద్రా (వీడియో)

మా ప‌రిశోధ‌క‌ బృందం అతనితో కలిసి పని చేయవచ్చు. Maths Teacher Bilal From Srinagar Makes ‘Unique’ Solar Car.

Update: 2022-07-21 12:45 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః సోష‌ల్ మీడియాలో సొంత పాపులారిటీ కోసం కాకుండా స‌మాజంలో సంగ‌తుల‌ను పాపుల‌ర్ చేసే సెల‌బ్రిటీలు త‌క్కువ‌గా ఉంటారు. అలాంటి వారిలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పద్మ అవార్డు గ్రహీత ఆనంద్ మహీంద్రా ఒక‌రు. దాదాపు ప్రతిరోజూ ఆయ‌న‌ ఏదో ఒక ప్ర‌త్యేక‌మైన అంశాన్ని షేర్ చేస్తుంటారు. అది కాస్త‌ వైరల్ కాక మాన‌దు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్వీట్‌లో, జమ్మూ, కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక గణిత ఉపాధ్యాయుడు తయారు చేసిన ప్రత్యేకమైన సోలార్ కారు వీడియోను షేర్ చేశారు.

శ్రీనగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్ స్వ‌యంగా సౌరశక్తితో నడిచే కారును తయారు చేశాడు. ఎలక్ట్రానిక్ కార్ మార్కెట్, గ్రీన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఈ ఆవిష్కరణ ఒక ముందడుగుగా చెప్పాలి. వీడియోలో బిలాల్ న‌డుపుతున్న‌ కారు తలుపులు, కిటికీలు, బానెట్, ట్రంక్ పైన‌ సోలార్ ప్యానెళ్లు కనిపిస్తాయి. దీని తర్వాత బిలాల్ ఈ కారు విశేషాలను వివరిస్తారు. ఈ సంద‌ర్భంగా, బిలాల్ స్ఫూర్తి అభినందనీయమని ఆనంద్ మహీంద్రా అభివర్ణించారు. బిలాల్ అభిరుచి అభినందనీయం అని, ఈ ప్రోటోటైప్‌ని అతను ఒంటరిగా అభివృద్ధి చేస్తున్నందుకు అభినందిస్తున్నాను అన్నారు. బహుశా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా ప‌రిశోధ‌క‌ బృందం దానిని మరింత అభివృద్ధి చేయడానికి అతనితో కలిసి పని చేయవచ్చు అని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌కి ట్విటర్ యూజర్లు చాలా మంది స్పందిస్తున్నారు. 


Similar News