తల్లి ఒత్తిడికి గురైతే పసిబిడ్డ ఏడుపు.. పుట్టిన క్షణం నుంచే ఈ బంధం

ప్రసవం తర్వాత తల్లి ఒత్తిడికి గురైతే బిడ్డ ఆటోమేటిక్‌గా ఏడుస్తుందని మీకు తెలుసా? అవును..

Update: 2023-04-24 08:40 GMT

దిశ, ఫీచర్స్: ప్రసవం తర్వాత తల్లి ఒత్తిడికి గురైతే బిడ్డ ఆటోమేటిక్‌గా ఏడుస్తుందని మీకు తెలుసా? అవును.. ఫ్యామిలీ సపోర్ట్ అందని మదర్ పోస్ట్‌పార్టమ్ స్ట్రెస్.. శిశువు ఉదరం నొప్పికి కారణమవుతుందని అంటున్నారు నిపుణులు. ఈవినింగ్ టైమ్‌లో పిల్లలు దాదాపు గంట నుంచి మూడు గంటల వరకు ఏడ్వడం ఈ పరిధిలోకే వస్తుండగా... పేరెంట్స్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నవజాత శిశువులు గుక్కపెట్టి ఏడుస్తూనే, తమంతట తామే కామ్ అయిపోతారు. బిడ్డ నాలుగు నెలల వయసుకు వచ్చేసరికి ఈ పరిస్థితి ఆటోమేటిక్‌గా సద్దుమణిగిపోతుంది.

సాధారణంగా దీన్ని ఉదర సంబంధిత సమస్యగా వర్ణించినా.. తల్లిలో ఒత్తిడి ఇందుకు కారణమని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇదొక సైకిల్ మాదిరిగా ఉంటుందని.. తల్లి మెటర్నల్ స్ట్రెస్‌‌కు గురైతే బేబీ ఏడుస్తుంది. దీంతో ఒత్తిడిలో ఉన్న ఆమె శిశువును ఎలా కన్సోల్ చేయాలో అర్థం కాక మరింత స్ట్రెస్ ఫీల్ అవుతుంది. బేబీ మరింత ఏడుస్తుంది. సాధారణంగా డాక్టర్స్ ఈ సిచ్యువేషన్‌లో సోలక్ అండ్ ప్రోబయోటిక్ డ్రాప్స్ ఇస్తారు కానీ అవి దాదాపు హెల్ప్ చేయవనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

తల్లి ఏం చేయాలి?

- కామ్‌గా ఉండాలి.

- ఒత్తిడితో ఆందోళనకు గురికాకూడదు.

- బిడ్డను గట్టిగా హత్తుకోవాలి.

- సైడ్‌కు లేదా పొట్టమీద పడుకోబెట్టండి.

- బేబీ కోసం పాట పాడండి.

- ఆ తర్వాత ఊయలలో పడుకోబెట్టి ఊపండి.

- కాసేపయ్యాకు బిడ్డకు పాలివ్వండి.

Also Read..

పెళ్లికి ముందే సెక్స్.. కాపురంలోకి ఎంటరవుతున్న మాజీ లవర్స్! మరి భాగస్వామితో సంసారం చేసేది ఎలా..?

Tags:    

Similar News