పెట్రోల్ రేటు పెరిగింద‌ని ఓ ల్యాబ్ అసిస్టెంట్ దీన్ని కొన్నాడు! త‌ర్వాత ఏమ‌య్యిందంటే..

క‌రోనా ఇత‌ని లైఫ్‌లోనూ క‌ష్టాల‌ను తీసుకొచ్చింది. Aurangabad Man bought Horse to go to the work.

Update: 2022-03-15 11:03 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌హారాష్ట్ర‌, ఔరంగాబాద్‌లో షేక్ యూస‌ఫ్ తెలియ‌నివారుండ‌రు. ఒక‌వేళ పేరు తెలియ‌క‌పోయినా గుర్రంపై ఆఫీసుకెళ్లే వ్య‌క్తి ఎవ‌రంటే ఇట్టే చెప్పేస్తారు. క‌రోనా ఎంతో మంది జీవితాల‌ను నాశ‌నం చేసిన‌ట్లే ఇత‌ని లైఫ్‌లోనూ క‌ష్టాల‌ను తీసుకొచ్చింది. వృత్తిప‌రంగా ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ అయినా, ఉట్టి ప‌ర్సు జేబులో పెట్టుకొని తిర‌గాల్సిన ప‌రిస్థితి దాపురించింది. కరోనా కార‌ణంగా కాలేజీలు మూత ప‌డ‌టంతో చేసేది లేక‌, నిత్య‌వ‌స‌ర స‌రుకులు తెచ్చి స్థానికంగా అమ్ముకునే చిరు వ్యాపారాన్ని మొద‌లుపెట్టాడు. మొత్తానికి, క‌రోనా శాంతించి కాలేజీలు తెరిచారు. వైబి ఛావ‌న్ కాలేజ్ ఆఫ్ ఫార్మ‌సీ తెరుకుంది. వాళ్లు యూస‌ఫ్‌కు ఫోన్ చేసి, జాబ్‌లో జాయిన్ అవ్వ‌మ‌న్నారు. ఉన్న పాత బైక్ వేసుకొని ఎలాగొలా ప‌నికి వెళ్దామ‌న్నాపెట్రోల్ రేటు తెలియందెవ‌రికి..?! లీట‌రు పెట్రోల్ డ‌బ్బుల్తో రెండు కేజీల కంటే ఎక్కువే బియ్యం కొనుక్కోవ‌చ్చు. స‌రిగ్గా, ఈ క‌ఠోర కాలంలో క‌ఠారా బైక్ అమ్మేసి, దానికి ఇంకొంత డ‌బ్బులు అప్పు తీసుకొని, 'జిగ‌ర్‌'ను ఇంటికి తీసుకొచ్చాడు.

ఖ‌తైవారీ బ్రీడ్ న‌ల్ల‌ని గుర్రం ఈ 'జిగ‌ర్‌'. పెట్రోల్ ఖ‌ర్చు కంటే చ‌వ‌క‌, అంతేకాక గుర్రం స్వారీతో మ‌నిషికి ఎంతో ఆరోగ్యం, అంత‌కుమించి ముసలిత‌నం కూడా అంత త్వ‌ర‌గా రాదంట‌! ఇంకేం కావాలి? కొన్ని రోజుల్లో యూస‌ఫ్ కాస్తా 'ఘోడా వాలా' అయ్యాడు. స‌రైన ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేని 16 కి.మీ. త‌న ఆఫీసు ప్ర‌యాణాన్ని హాయిగా పూర్తిచేస్తున్నాడు. అంతేనా, అప్పుడ‌ప్పుడూ చుట్టుప‌క్క‌లున్న చిన్న‌పిల్ల‌ల్ని కూడా గుర్రం ఎక్కించుకొని స‌ర‌దాగా స్వారీకీ వెళ్తున్నాడు. 'జిగ‌ర్' జింద‌గీనే మార్చేసిందంటూ సంతోషంగా చెప్పుకుంటున్నాడు.  

Tags:    

Similar News