Viral: అత్త తమ టూత్ పేస్ట్ వాడిందని.. భార్యాపిల్లలను వదిలేసిన భర్త.. అసలు కథ విని తిట్టిపోస్తున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో ఏదైనా డిఫరెంట్ గా జరిగితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఓ రెడిట్ యూజర్ షేర్ చేసిన స్టోరీ కూడా ఇలాంటిదే. అత్త తమ టూత్ పేస్ట్ యూజ్ చేసిందని.. భార్యాపిల్లలను ఇటలీలోనే వదిలేసి ఇంటికొచ్చాడు.

Update: 2024-08-11 09:20 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో ఏదైనా డిఫరెంట్ గా జరిగితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఓ రెడిట్ యూజర్ షేర్ చేసిన స్టోరీ కూడా ఇలాంటిదే. అత్త తమ టూత్ పేస్ట్ యూజ్ చేసిందని.. భార్యాపిల్లలను ఇటలీలోనే వదిలేసి ఇంటికొచ్చాడు. తన తప్పేమైనా ఉందా అంటూ ఈ కథను నెటిజన్లతో పంచుకున్నాడు. స్టోరీ మొత్తం విని మీరు ఏమంటారో చూద్దాం మరి.

ముందుగా కథ ఏంటంటే రొమాంటిక్ సిటీగా పేరుగాంచిన వెనిస్ అంటే భార్యకు ఇష్టమని వెకేషన్ ప్లాన్ చేశాడు సదరు యూజర్. వైఫ్, పాపతో చక్కగా ట్రిప్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. టికెట్స్, రూమ్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన అత్త.. తను కూడా వస్తానని భార్యపై ఒత్తిడి తీసుకురావడంతో ఆమె కాదనలేకపోయింది. పైగా మరో రూమ్ కూడా బుక్ చేయకుండానే ట్రిప్ స్టార్ట్ అయింది. ఇక అక్కడికి చేరుకున్నాక భార్య, తాను ఉండాల్సిన బెడ్ మీద అత్త కూర్చోవడం, పడుకోవడం ఆయనకు నచ్చలేదు. తను ఏరికోరి కొన్న తన భార్య మేకప్ వాడటం అస్సలు ఇష్టంలేదు. చివరకు టూత్ పేస్ట్ కూడా తమదే వాడిందని చెప్పిన యూజర్.. బ్రష్ ను పేస్ట్ ట్యూబ్ కు అంటించి మరీ తీసుకోవడం అపరిశుభ్రంగా అనిపించిందన్నాడు.

దీంతో విసిగిపోయిన తను.. అత్తతో ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. కానీ రూమ్ మరొకటి లేకపోవడం, కోపం ఎక్కువైపోవడంతో.. అక్కడే భార్యాపిల్లలను వదిలేసి ఇంటికొచ్చేశాడు. దీంతో పాప ఏడుస్తుందని భార్య కాల్ చేసినా ఇప్పుడు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. బండ బూతులు తిడుతున్నారు. ఆ మాత్రం ఓర్చుకోలేకపోతే మనిషివి ఎలా అవుతావని కొందరు అంటుంటే.. బాబు ఇంకో పేస్ట్ కొనుక్కుంటే అయిపోయేది కదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు ట్రిప్ కు రావొద్దని స్పష్టంగా చెప్తే ఈ ఇబ్బందులు ఉండకపోయేవని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News