మగ ఈగల వింత ప్రవర్తన.. ఆడ ఈగ అందుకు వద్దంటే.. మనుషుల మాదిరిగానే ఏం చేస్తాయో తెలుసా?

మగ ఈగలు(డ్రోసోఫిలా మెలనోగాస్టర్).. ఆడ ఈగలను శృంగారంలో పాల్గొనేందుకు ఆహ్వానించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాయి. జననాంగాలను నొక్కడం, పొత్తి కడుపు ప్రెస్ చేయడం, తన రెక్కలతో పాటలు పాడటం చేస్తుంటాయి. కానీ ఇవన్నీ ఫెయిల్ అయితే.. ఆడ ఈగ ఒప్పుకోకపోతే. ఏం చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (UCSF), హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌,

Update: 2024-09-17 13:21 GMT

దిశ, ఫీచర్స్ : మగ ఈగలు(డ్రోసోఫిలా మెలనోగాస్టర్).. ఆడ ఈగలను శృంగారంలో పాల్గొనేందుకు ఆహ్వానించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాయి. జననాంగాలను నొక్కడం, పొత్తి కడుపు ప్రెస్ చేయడం, తన రెక్కలతో పాటలు పాడటం చేస్తుంటాయి. కానీ ఇవన్నీ ఫెయిల్ అయితే.. ఆడ ఈగ ఒప్పుకోకపోతే. ఏం చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (UCSF), హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌, జానెలియా ఫార్మ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో... ఫ్లర్టింగ్ ఫెయిల్ అయితే ఆల్కహాల్ కలిగిన ఆహారం తినేందుకు ఇష్టపడతాయని తెలిపారు.

ఫ్లై మెదడులోని న్యూరోపెప్టైడ్ ఎఫ్ (NPF) సిగ్నలింగ్ కెమికల్ ఈ ప్రవర్తనను బలపరుస్తుందని బృందం చెప్తుంది. సెక్స్‌ తిరస్కరించబడిన మగ ఈగలు బ్రెయిన్ లో తక్కువ స్థాయి NPFని కలిగి ఉంటాయి. ఇది మద్యం తీసుకునేందుకు కారణం అవుతుంది. ఇలా ఆడ ఈగలతో హేట్ చేయబడినవనే కాదు శృంగారం కోసం వెయిట్ చేస్తున్న మగ ఈగలన్నీ ఆల్కహాల్ ను ఆశ్రయిస్తాయని తేలింది. ఈ పరిస్థితి సంభోగం, ఆల్కహాల్ మధ్య మాలిక్యులర్ లింక్ ను సూచిస్తుంది. కాగా ఇలాంటి సిమిలర్ సిగ్నలింగ్ కెమికల్ న్యూరోపెప్టైడ్ Y.. మనిషి మెదడులో ఉందని చెప్తున్నారు పరిశోధకులు. కాగా ఆడ ఈగల విషయంలో మగ ఈగల ప్రవర్తన .. మనుషుల బిహేవియర్ కు దాదాపు సారూప్యంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Tags:    

Similar News