బాక్సింగ్ అంటే ఇష్టం లేకపోతే ఇలాగే ఉంటది మరి! (వీడియో)
ఇంకొందరు పిల్లాడిలో ఉన్న అసహనంపై చర్చిస్తున్నారు. Punches the gear with a sad and almost-on-the-verge-of-tears face.
దిశ, వెబ్‌డెస్క్ః ఒకప్పుడు సాధారణ విద్య కంటే నైపుణ్యం ముఖ్యంగా కనిపించింది. తర్వాత, విద్య మాత్రమే చాలా ప్రధానంగా మారింది. ప్రస్తుతం, చదువుతో పాటు ప్రతిభా, నైపుణ్యం చాలా అవసరంగా తోస్తోంది. దీనితో దేశీ కుటుంబంలో సంగీతం, నృత్యం, పెయింటింగ్, క్రీడలు, కరాటే వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ కార్యకలాపాల్లో ఆరితేరడానికి కోచింగ్ క్లాసులకు క్యూ కట్టిస్తున్నారు జనం. బంగారంలాంటి ఈ బిజినెస్‌లో ప్రవేశం పొందే అవకాశం వంద శాతం ఉంటుంది. ఇక, స్కూల్ నుండి వచ్చిన వెంటనే కోచింగ్‌లు, అలసిపోయినా, ఇష్టం లేకపోయినా అటెండెన్స్‌లు చాలా మంది పిల్లలకి బాధాకరంగా మారడం కొత్తేమీ కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఓ బుడ్డోడి కిక్ బాక్సింగ్ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. అది మిమ్మల్ని నవ్విస్తూనే, కాస్త ఆలోచింపజేస్తుంది.
ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో, కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో ఒక చిన్న పిల్లాడు ఇష్టంలేకపోయినా విచారంగా, దాదాపు కన్నీళ్లు వచ్చే ముఖంతో గేర్‌ను చిరాకుగా, నెమ్మదిగా కొడుతుంటాడు. "మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదైనా చేయమని బలవంతం చేసినప్పుడు," అని ఈ వీడియోకి సముచితమైన శీర్షిక ఉంటుంది. లక్షల్లో వీక్షణలు, టన్నుల కొద్దీ కామెంట్లతో నెటిజనులు వైరల్ చేశారు. కొందరు పిల్లాడి ఎక్స్‌ప్రెషన్‌ను చూసి నవ్వుతుంటే, ఇంకొందరు పిల్లాడిలో ఉన్న అసహనంపై చర్చిస్తున్నారు. మీరేమంటారు.. చూడండి!
When your parents force you to do something.
— Figen (@TheFigen) July 13, 2022
pic.twitter.com/9PaaPeMDEW