అరచేతితో సముద్రాన్ని ఆపాలనుకున్న బాలుడు.. చివరికి ఏమైందీ!? (వీడియో)
మీరు నవ్వుతూనే, స్వచ్ఛమైన అమాయకత్వాన్ని ఆశ్వాదిస్తారు. Boy used sign language to try to stop the waves at a beach.
దిశ, వెబ్‌డెస్క్ః పిల్లలంటేనే అమాయకత్వం, నిజాయితీకి ప్రతిరూపాలు. వారి చేష్టలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. ఈ వీడియోలో చెవిటి తల్లిదండ్రులకు జన్మించిన, సంకేత భాష తెలిసిన ఒక అబ్బాయి, ప్రతి ఒక్కరికి సంకేత భాష అర్థమవుతుందని భావించి, సముద్ర అలలకు కూడా ఆగిపోమ్మని సంకేతాలు ఇస్తుంటాడు. బాలుడి అమాయకత్వం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. జానెట్ మోరెనో అనే మహిళకు చెందిన "డెఫ్ మథర్‌హుడ్" అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఆ పిల్లాడు తాను ఆడుకునే ట్రక్కు బొమ్మతో అలల్ని పట్టుకోవాలని చూస్తాడు. అవి ఆగకుండా అతని మీదకు వస్తుండటంతో "వేచి ఉండండి, ఉండండి, ఉండండి!" అని అరచేయిని అడ్డం పెట్టి తరంగాలకు సంకేతాలు ఇస్తుంటాడు.
"మీ CODA అనుకుంటే అలలు సంకేత భాషను అర్థం చేసుకుంటాయి" అని ఈ పోస్ట్‌కు రాసిన శీర్షకలో ఉంటుంది. "అప్‌డేట్: CODA అంటే చెవిటి తల్లిదండ్రుల బిడ్డ. డేనియల్, నేను చెవిటి వాళ్లం. మా ఇద్దరు అబ్బాయిలు వినగలరు. అయితే, పిల్లాడు తను దేనికైనా సంకేతం ఇస్తే, ఏదైనా తన మాట వింటుందని ఎలా అనుకుంటాడో తలుచుకొని నేను ఇప్పటికీ చాలా విస్మయం చెందాను! " అని క్యాప్షన్‌లో వివరించారు. ఈ వీడియో చూస్తుంటే మీరు నవ్వుతూనే, స్వచ్ఛమైన అమాయకత్వాన్ని ఆశ్వాదిస్తారు. చూడండి!