Cycling Benefits: జస్ట్ 20 నిమిషాలు.. సైక్లింగ్‌తో కలిగే బెనిఫిట్స్ ఇవే..

Update: 2024-08-30 13:07 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చాలా ముఖ్యం. అలాంటి వాటిలో సైక్లింగ్ కూడా ఒకటి. రోజూ 20 నిమిషాలపాటు సైక్లింగ్ చేస్తే ఫిట్‌గా ఉండటంతోపాటు అనేక బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎముకలు, తుంటి ఎముకల ఆరోగ్యానికి, కండరాల బలానికి సైక్లింగ్ సహాయపడుతుంది. మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆ సందర్భంలో కండరాలు, శరీర కదలికలవల్ల శరీరం గంటకు 300 కేలరీలు బర్న్ చేస్తుంది. దీంతో అధిక బరువు సమస్యను నివారిస్తుంది.

పలు రకాల వర్కవుట్స్‌తో పోలిస్తే సైక్లింగ్ చాలా ఈజీ వ్యాయామం. అంతేకాకుండా ఇది ముఖ్యం కూడాను. శరీరంలో నరాల పనితీరు మెరుగు పర్చడంలో సైక్లింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. కాళ్లు, చేతులు, శరీర భాగాల మధ్య సమన్వయాన్ని సైక్లింగ్ మెరుగు పరుస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు. రోజు చేయడం ద్వారా యాంగ్జైటీస్, మెంటల్ టెన్షన్స్ నుంచి కూడా రిలీఫ్ పొందుతారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News