Vinayaka chavithi: మట్టి గణపయ్యను తయారు చేయడం ఇంత సులభమా..? వైరలవుతోన్న వీడియో
వినాయక చవితి పండుగ వస్తోందంటేనే పిల్లల్లో, పెద్దల్లో ఒక విధమైన ఆనందం కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. కాగా హైదరాబాద్‌లో ఇది చాలా ప్రత్యేకం.
దిశ, ఫీచర్స్ : వినాయక చవితి పండుగ వస్తోందంటేనే పిల్లల్లో, పెద్దల్లో ఒక విధమైన ఆనందం కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. కాగా హైదరాబాద్‌లో ఇది చాలా ప్రత్యేకం. కుల మతాలకు అతీతంగా అందరూ ఫెస్టివల్‌లో భాగస్వాములవుతుంటారు. 3 నుంచి 11 రోజులు సిటీ మొత్తం పండుగ వాతావరణమే కనిపిస్తుంది. చివరి రోజు భారీ ఊరేగింపుతో వినాయక నిమజ్జనం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే భక్తి పరంగానూ, పర్యవరణ హితంగానూ మట్టి గణపతులను వాడటం మంచిదని పెద్దలు, నిపుణులు చెప్తుంటారు. పలువురు ఇది పాటిస్తున్నారు కూడా.
గ్రామాల్లో అయితే ఒకప్పుడు మట్టి గణేషులనే ఎక్కువగా పెట్టేవారు. పిల్లలైతే చెరువులోని బంకమట్టి తెచ్చి విగ్రహాలను తయారు చేస్తూ తెగ సంబరపడిపోయే వారు. ఇకపోతే వినాయక చవితి నేపథ్యంలో మట్టి గణపయ్యలను తయారు చేసే విధానంపై నెట్టింట ఒక వీడియో ఆకట్టుకుంటోంది. వైరల్ వీడియోలో మట్టి గణపయ్యను సులభంగా ఎలా తయారు చేయవచ్చో మనం గమనించవచ్చు. మట్టి, స్క్రూ డ్రైవర్లు, స్పూన్ లాంటి పరికాలు తీసుకొని చూస్తుండగానే వినాయకుడి పీఠాన్ని సిద్ధం చేశారు. అనంతరం వినాయకుడి కాళ్లు, చేతులు, చెవులు ఇతర శరీర భాగాలను ఈజీగా రెడీ చేశారు. ఇంకేముంది అందమైన మట్టి గణపయ్య రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Video credits to anad artcraft studio on youtube