అదే పనిగా ఆవలింతలు రావడం ఆరోగ్యమా.. అనారోగ్యమా?
ఆవలింతలు రావడం అనేది సహజం. చాలా మందికి ఆవలింతలు అనేవి వస్తుంటాయి. అయితే కొందరికి మాత్రం అదే పనిగా పదినిమిషాలకు ఒకసారి ఆవలింతలు వస్తాయి. ఇలా తరచూ ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతం
దిశ, వెబ్‌డెస్క్ : ఆవలింతలు రావడం అనేది సహజం. చాలా మందికి ఆవలింతలు అనేవి వస్తుంటాయి. అయితే కొందరికి మాత్రం అదే పనిగా పదినిమిషాలకు ఒకసారి ఆవలింతలు వస్తాయి. ఇలా తరచూ ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు.
వాస్తవానికి మనిషి శరీరం పూర్తిగా అలసటకు లోనైనప్పుడు నువ్వు నిద్ర పోవాలని సూచనగా ఆవలింతలు వాతంట అవే వస్తాయట. కానీ అదే పనిగా , నిద్రపోతున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తే అది తీవ్ర అనారోగ్యానికి సంకేతం అంట.
ఎక్కువగా ఆవలింతలు రావడం అనేది మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ అందడంలేదని తెలుసుకోవాలంట.ఇలా మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ అందనప్పుడు, రక్తప్రసరణలో అవకతవకలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే అదేపనిగా ఆవలింతలు వస్తూ ఉంటే శరీరానికి శ్వాస సరిగా అందటం లేదని అర్థం చేసుకోవాలని, ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ::
బాత్‌రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
సోషల్ మీడియాకు దూరంగా ఉంటే జరిగే పరిణామాలివే?
Chanakya neeti : స్త్రీలు స్నానం చేయకుండా అస్సలే చేయకూడని పనులు ఇవేనంట?!