ఈ ఏడాది కూడా రాఖీ పండుగ నాడు భద్రుని నీడ ఉందా.. శాస్త్రం ఏం చెబుతుందంటే?

శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండుగ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-07-28 09:32 GMT

దిశ, ఫీచర్స్: శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండుగ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ పండుగను సోదరసోదరీమణులకు ప్రత్యేకమైన పండగగా భావిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం ప్రతి సంవత్సరం బలవపడుతూ ఉండాలని, ఎలాంటి గొడవలు రాకుండా కలిసి మెలసి ఉండాలని కోరుకుంటూ ప్రతిఏటా భారతదేశంలోని సోదరీమణులు తమ తమ సోదరులకు రాఖీ కట్టి వారి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే ఈ ఏటా దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఆగస్టు 19 వ తారీకున జరుపుకోవాలంటున్నారు జ్యోతిష్య పండితులు.

అలాగే రాఖీ పౌర్ణమి నాడు భద్ర కాలంలో పొరపాటున కూడా సోదరుడికి రాఖీ కట్టొద్దంటున్నారు జ్యోతిష్యులు. పంచాంగం ఆ రోజు భద్ర నీడ ఉంటుందట. కాగా మధ్యాహ్నం 1. 30 నుంచి రాత్రి 9. 07 వరకు అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టడం మంచి ముహూర్తమని తాజాగా పండితులు చెబుతున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భద్ర ప్రభావం చూపిస్తుందట. కాగా ఈ భద్ర కాలంలో రాఖీ కట్టడం వల్ల అశుభం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ భద్ర కాలంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయడం మంచిది కాదంటున్నారు. దీంతో ఆగస్టు 19 వ తారీకున 1. 30 అశుభ గడియలు పోతాయి. అనంతరం ఏం సందేహం లేకుండా 9. 07 గంటల వరకు సోదరుడికి రాఖీ కట్టొచ్చని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

Tags:    

Similar News