లైక్స్ కంటే లైఫే చాలా ముఖ్యం.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!
అప్రమత్తంగా ఉండాలంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. Life is more important than likes know with a terrifying video.
దిశ, వెబ్‌డెస్క్ః సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్లో విచిత్రమైన మార్పు కూడా వచ్చింది. సోషల్ మీడియానే జీవితంగా మార్చుకున్న వ్యక్తులున్నారు. అయితే, ఈ బిజినెస్‌లో చాలా మంది పావులుగా మారుతున్నారు. వెకేషన్‌లో పర్ఫెక్ట్ షాట్ పొందాలనే క్రేజ్ పెరిగింది. ఎక్కడికైనా సరదాగా వెళితే ఆ ప్రదేశాన్ని, వాతావరణాన్ని ఆశ్వాదించకుండా ఫోటోలతో, సెల్ఫీలతోనే సమయం గడపడం అలవాటయ్యింది. వారి సరదాని నలుగురుకీ చూపించాలనీ, సోషల్ మీడియాలో ఆ పిక్స్‌కి పీక్స్‌లో లైక్స్ రావాలాని ఆశిస్తున్నారు. కిందా మీదా పడి, పర్ఫెక్ట్ షాట్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ షాకింగ్ వీడియోను IPS అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఇందులో తీరం వెంబడి వేగంగా ఎగసిపడుతున్న అలల దగ్గర ప్రమాదకరంగా నిలబడి ఉన్న వ్యక్తుల సమూహం ఉంటుంది. అందులో పలువురు సెల్ఫీలు దిగుతూ కనిపిస్తారు. కొన్ని సెకన్లలో ఒక భారీ అల వచ్చి ఒడ్డున ఫోటోలు తీసుకుంటున్న కొంత మందిని సముద్రంలోకి లాక్కెళుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ, ఇందులో ఇద్దరు యువతులు అలలో చిక్కుకుని సముద్రంలోకి వెళ్లడం కనిపిస్తుంది. "మీ 'ఇష్టాలు' కంటే మీ 'లైఫ్' చాలా ముఖ్యమైనది," అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో ఉన్న వ్యక్తుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అప్రమత్తంగా ఉండాలంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.
Your "Life" is more important than your "Likes". pic.twitter.com/3XNjyirbwJ
— Dipanshu Kabra (@ipskabra) July 13, 2022