బ్రాకు బర్త్ డే ఉందని తెలుసా?..దీనిని మొదట ఎవరు వేసుకున్నారంటే?

మహిళలు వాడే దుస్తుల్లో బ్రా ఒకటి. చాలా మంది దీని పేరు తీయడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ ప్రతి మహిళ జీవితంలో ఒక భాగం లాంటిదే. దీనిని ధరించడం వలన అమ్మాయిలు చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు. ఇ

Update: 2024-05-17 09:50 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలు వాడే దుస్తుల్లో బ్రా ఒకటి. చాలా మంది దీని పేరు తీయడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ ప్రతి మహిళ జీవితంలో ఒక భాగం లాంటిదే. దీనిని ధరించడం వలన అమ్మాయిలు చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు. ఇది వక్షకోజాలు సరైన ఆకృతిలో ఉంచుతుంది. అయితే బ్రా గురించి చాలా మందికి తెలియని ఒకటి ఉంది. అది ఏమిటంటే.. దీనికి కూడా ఓ బర్త్‌డే ఉంది. అంటే బ్రా ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, దీనిని ఎవరు ముందు ధరించారో చాలా మందికి తెలియదు. కాబట్టి బ్రాకు సంబంధించిన ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లైఫ్ మ్యాగజైన్ ప్రకారం.. బ్రా అనేది మే 30,1869లో ఫ్రాన్స్‌లో పుట్టిందంట. అక్కడ హెర్మి కాడోల్ లోదుస్తులను తయారు చేయడానికి కార్పెట్‌ను రెండుగా కత్తిరించారు.ఇది అండర్ మెంట్‌కు కోరెలెడ్ జార్టర్ అని పేరు పెట్టారు తర్వాత దీనిని ధరించి బ్రాగా విస్తరించారంట. అంటే సుమార్ 500ల సంవ్సరాల క్రితమే ఇది పుట్టడమే కాకుండా దీనిని ధరిస్తూ వస్తున్నారంట ప్రజలు. అయితే మొదటగా ఇది కార్పెట్ రూపంలో రాగా, తర్వాత వస్త్రాన్ని బ్రాలా మార్చారంట. అయితే అది కాస్త డిఫరెంట్‌గా జాకెట్ రూపంలో ఉండేదంట. తర్వాత దానిని పూర్తిగా మారుస్తూ బ్రా లా తీసుకొచ్చారంట.

అయితే మొదట్లో ఇవి వాడేందుకు మహిళలు చాలా ఇబ్బంది పడేవారంట. కొంత మంది కళ్లు తిరిగిపడిపోవడం తో దీని వాడకం పూర్తిగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది. కానీ మళ్లీ ఇప్పుడు వీటి ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని వాడుతున్నారు.


Similar News