పెళ్లి డెకరేషన్‌కు నిప్పు పెట్టి, ఆ మంటల్లో దూకి ఇలా.. ఇంతకీ ఏమయ్యింది?!
అతిథి డ్యాన్స్ చేస్తూ పటాకులు కాలుస్తుండగా మంటలు చెలరేగాయి. In viral video, guest start fire at wedding accidentally.
దిశ, వెబ్‌డెస్క్ః పెళ్లిలో కొందరు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక, వివాహ వేడుకలో మందుబాబులు చేసే చిందుల గందరగోళానికి ఏమైపోతుందోనని మిగిలినవారు కంగారుపడుతుంటారు. సరిగ్గా, ఈ వివాహంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి ఎదురయ్యింది. తాగి తందనాలాడుతున్న ఓ వ్యక్తి పెళ్లి డెకరేషన్‌కు నిప్పంటించాడు. వివాహ వేదిక దగ్గరున్న ఈ అతిథి డ్యాన్స్ చేస్తూ పటాకులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే, పరిస్థితి చేయి దాటిపోకముందే అతడే దాన్ని అదుపులోకి తీసుకురావడం విశేషం. ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోలో సూట్ ధరించిన ఓ వ్యక్తి క్రాకర్ పువ్వొత్తులను కాలుస్తూ, అనుకోకుండా పెళ్లి అలంకరణకు నిప్పంటిస్తాడు. అతనున్న సంతోషకరమైన మూడ్‌లో మండుతున్న నిప్పును చూసి కూడా ఉల్లాసంగానే డ్యాన్స్ చేస్తూ మంటల్లో దూకుతాడు. బూటు కాళ్లతో మంటు తొక్కుతూ డ్యాన్స్ చేసి, మంటల్ని ఆర్పేస్తాడు. "నా పెళ్లిలో నేను ఎంత తాగాను" అని వీడియో క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
This how drunk I'm tryna be at my wedding pic.twitter.com/RchInxywDa
— Thomas (@ThomasMightSnap) July 2, 2022