ఈ దేశాల్లో అమ్మాయిలు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరగొచ్చు..

ప్రపంచం చాలా ఫాస్ట్‌గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా నేటి యువత అన్నింట్లో ముందుంటుంది.

Update: 2023-06-17 15:05 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచం చాలా ఫాస్ట్‌గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా నేటి యువత అన్నింట్లో ముందుంటుంది. ఒంటరిగా తిరగడం ప్రారంభించింది. ఇది పురుషుల వరకు ఒకే కానీ స్త్రీలు మాత్రం భద్రత, సమానత్వం విషయంలో ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సోలో ట్రావెల్ ట్రెండ్‌లో భాగంగా విదేశీ ప్రయాణాలు చేసే సమయంలో మహిళలు ధైర్యం చేసి వెళ్లినప్పటికీ కచ్చితంగా ఒక ప్రాబ్లం అయిన ఫేస్ చేస్తున్నారు. కానీ అలాంటి భయం లేకుండా అమ్మాయి అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరగగలిగే కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం.

1. స్లొవేనియా

*డబ్ల్యూపీఎస్ ఇండెక్స్ ప్రకారం మధ్య, తూర్పు యూరప్‌లోని స్లొవేనియా మహిళల భద్రత విషయంలో అత్యుత్తమ ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ నివసించే వారిలో, పర్యటించిన వారిలో 85 శాతం మంది మహిళలు స్లొవేనియాను అత్యంత భద్రత కలిగిన ప్రదేశంగా భావిస్తున్నారు.

*అలా అక్కడ టూర్‌కి వెళ్ళిన వారు రాత్రి వేళ ఫొటోలు తీసుకుంటూ వీధుల్లో సంచరించారు. కానీ వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మరెక్కడైనా అయితే ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ ఇక్కడ మాత్రం అలా లేదు అని చెప్పారు.

2. రవాండా

*పార్లమెంట్‌లో మహిళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో రవాండా మొదటి స్థానంలో ఉంది. ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం రవాండా పార్లమెంట్‌లో 55 శాతం మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* అందుకని సోలో ట్రావెలర్స్‌కి భద్రత విషయంలో రవాండా అత్యుత్తమమైనా దేశంగా పేర్కొన్నారు. అక్కడి స్థానికులను చూడగానే మొదట కొంత భయంగా అనిపిస్తుంది. కానీ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు.

* రువాండాలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ అధికారిక భాషలు. వాటితో పాటు కిన్యార్‌ వాండా, కిస్వాహిలి వాడుకలో ఉంటాయి. భాషాపరంగా కొద్దిగా ఇబ్బంది తలెత్తవచ్చు. కానీ అక్కడి వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడకపోయినా సైగల ద్వారా మనం వెళ్లాల్సిన దారి చెప్పడంలో సాయం చేస్తారు.

3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

*మహిళలకు విద్య, ఆర్థిక పరమైన అంశాల్లో మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. లింగ సమానత్వం కలిగిన యూఏఈ.. ముఖ్యంగా మహిళల భద్రతలో 98.5 శాతంతో అన్ని దేశాల కంటే ముందుంది. ఈ నగరంలో రాత్రి పూట ఒంటరిగా తిరిగినా సురక్షితంగా ఉన్నామని అక్కడి మహిళలు చెప్పారు. అలా చెప్పిన వారిలో 15 ఏళ్ల నుంచి పెద్ద వయసు మహిళలు ఉన్నారు.

* అందుకే సోలో ట్రావెల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి. ఇక్కడ ప్రయాణించిన వారు తెలిపిన వివరాల ప్రకారం.. సాహసోపేతంగా అనిపించాలంటే స్కైడైవింగ్ ట్రై చేయాలన్నారు.

4. జపాన్

*గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం అత్యంత సురక్షితమైన దేశాల్లో జపాన్ తొలి పది స్థానాల్లో నిలిచింది. అక్కడ క్రూరమైన నేరాల రేటు, అంతర్గత సమస్యలు కూడా తక్కువేనని ఆ సంస్థ పేర్కొంది.

* అందుకే మహిళలు వెళ్లేందుకు ప్రత్యేకమైన ప్రదేశాలో జపాన్ ఒకటి. అక్కడికి వెళితే మన సొంతింట్లో ఉన్నట్టు ఉంటుంది. అక్కడి ప్రజలు కొత్త వాళ్లకు సంతోషంగా సాయం చేస్తారని ట్రావెల్ చేసిన వారు పేర్కొన్నారు.

5. నార్వే

లింగ సమానత్వం, సంతోషకరమైన దేశాల జాబితాలో నార్వే తొలి పది స్థానాల్లో ఉంటుంది. అన్ని రకాల పర్యాటకులకు సోలో ట్రావెలర్స్‌కి నార్వే సరైన ప్రదేశం. సహనం, విశ్వాసం ఇక్కడి సంస్కృతిలో భాగం. అందుకే ఒంటరి మహిళలకు ఇది అత్యుత్తమ ప్రదేశమని తెలిపారు.


Similar News