పెళ్లి స్టేజ్‌పైనే ఇర‌గ‌దీసిన నూత‌న వధువ‌రులు.. కేకో కేక‌! (వీడియో)

the groom and bride gave a rocking dance performance.

Update: 2022-07-11 09:44 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః వివాహ వేదిక‌పైన పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అందంగా అలంక‌రించుకుని, సిగ్గుప‌డుతూ, ఓర చూపులు చూసుకుంటూ ఉంటుంటే చాలా ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఇది స‌ర్వ‌సాధార‌ణ‌మే. కానీ, నూత‌న వ‌ధువ‌రుల‌కు పెళ్లి క‌ళ వ‌చ్చిన త‌రుణంలో స్టేజీ దద్ధ‌రిల్లేట‌ట్లు క్రేజీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ క‌పుల్‌ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఎంతో ముద్దుగా, ముచ్చ‌ట‌గా స్టెప్పులేసి, వారి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఆ రోజును మ‌రింత తృప్తిగా, సంతోషంగా, క‌ల‌కాలం గుర్తుండిపోయేలా చేసుకున్నారు. బాలివుడ్ సినిమాలోని గోవింద న‌టించిన‌, తుమ్సా కోయి ప్యారా అనే పాట‌పై తమ రాకింగ్ ప్రదర్శనతో ఇర‌గ‌దీసారు. అయితే, డ్యాన్స్ చేసినంత సేపూ ఈ జంట ఒకరినొకరు చూసుకోలేదు కానీ, వారి కెమిస్ట్రీ అదిరిపోయింది. వధువు అందమైన లెహంగా ధరించగా, వరుడు నలుపు రంగు టక్సేడో మెరిపించారు. ఈ "జోడి నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌" అంటూ దీపాంశు కబ్రా షేర్ చేసిన వీడియోకు నెటిజ‌నుల నుండి మంచి స్పంద‌న‌లు వ‌స్తున్నాయి.


Similar News