లవ్ ప్రపోజల్ ఓకే.. కానీ, ముఖంపైన ఫటాక్..! (వీడియో)
7 సంవత్సరాలు కలిసి సంతోషంగా ఉన్నామని అందరికీ చెప్పింది. In A Viral Video, Safari Park Proposal Goes Wrong.
దిశ, వెబ్‌డెస్క్ః ఆహ్లాదకరమైన వాతావరణం. పకృతి ఒడిలో, అద్భుతమైన జంతువుల మధ్య తన ప్రియుడి రొమాంటిక్ ప్రపోజల్ ఎంతో అందంగా ఊహించుకుంటుంది ఆ యువతి. ఇంతలో ఆహ్వానం లేని ఓ అతిథి ఆ ప్రేమ ప్రతిపాదనకు అంతరాయం కలిగించడంతో పాటు ఆమె మొహంపై ఫటామని మోదింది. ఈ వీడియోకు టిక్‌టాక్‌లో వచ్చిన మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ పక్కనపెడితే, పాపం ఆమె మొహం ఎంత వాచిందో ఏమో తెలియదు! ఆ "తర్వాత కొన్ని రోజులు ఆమె నెక్ బ్రేస్ ధరించాల్సి వచ్చింది - కానీ ఇప్పటికీ ఆ లవ్ ప్రపోజల్ అత్యుత్తమైనది" అని ఆమె క్యాప్షన్‌లో పేర్కొనడం విశేషం. ఈ జంట సఫారీ పార్క్‌లో తమ ఏకంత సమయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఇలా జరగడం కాస్త ఇబ్బంది పెట్టిన, ఇరువురి ప్రేమ ఫలించింనందుకు ఆనందపడ్డారు. అయితే, నెటిజన్లు ఈ క్లిప్‌ను సరదాగా భావించినా, ఇది తమ వివాహానికి చెడ్డ శకునమని చెప్పారు. అయినా, ఆమె వారికి కౌంటర్ ఇచ్చింది. తాము 7 సంవత్సరాలు కలిసి సంతోషంగా ఉన్నామని అందరికీ చెప్పింది. "జిరాఫీ కేవలం జిరాఫీగానే ఉంది," అని తమ ప్రేమను మరింత గొప్పదిగా చేసింది.
Woman left in neck brace after giraffe injured her during safari park proposal#BBNaija • #AquafinaPadiOfLife • Zack Orji • Arise News • #jeremiahfufeyinexposed • WTF Lagos • RIP Maria pic.twitter.com/rUEklDqqM5
— TWAA.ng (@TWAA_ng) July 22, 2022