మెడ ఫిట్‌నెస్ కోసం స‌రికొత్త ట్రైనింగ్ ట్రిక్‌! (వీడియో)

స‌ర‌దాగా ఉన్నా స్టంట్ మాత్రం ప్రమాదకరమైనదని హెచ్చ‌రిక. Man Fights With Strong Goat For Fitness Training To Neck.

Update: 2022-07-16 13:20 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః నానాటికీ ప్ర‌జ‌ల్లో ఆరోగ్యంపై మ‌రింత శ్ర‌ద్ధ పెరుగుతోంది. బాడీ ఫిట్‌నెస్‌ను సీరియ‌స్‌గా పరిగణిస్తున్నారు. ఇక‌, బాడీ బిల్డింగ్‌, ఫైటింగ్ క్రీడాకారులైతే కొత్త కొత్త మార్గాల్లో ఫిట్‌నెస్‌ను అభివృద్ధి చేసుకునే మార్గాలు వెతుకుతుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల చాలా మంది ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లను త‌ర్వాత‌ స్థాయికి తీసుకెళ్లడం సోష‌ల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ మ‌ధ్య ఓ వృద్ధ భార‌తీయ మ‌హిళ డెడ్‌లిఫ్టింగ్‌లో యువ‌కుల కంటే మెరుగ్గా ఉన్న వీడియో వైర‌ల్ అయ్యింది. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుత‌ వీడియోలో ఒక వ్యక్తి తన ఫిట్‌నెస్ శిక్షణ కోసం బలంగా ఉన్న ఓ గొర్రెపోతుతో త‌ల‌బ‌డుతుంటాడు. ఇది ట్విట్టర్‌లో క్రేజీగా వైరల్ అవుతోంది. ఈ క్లిప్ KDOT అనే పేజీలో షేర్ చేయ‌గా 5.2 మిలియన్లకు పైగా వ్యూవ్స్‌ పొందింది. ఓ పెద్ద కొండ‌రాయి పైన గొర్రెపోతు త‌ల‌కి కింద ఉన్న వ్యక్తి తన తలను ఆనిచ్చి, మెడ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. దాదాపు 20 సెకన్ల పాటు తల పోటీలో గొర్రె తన బలంతో మనిషిని దూరంగా నెట్టగలిగింది.

ఈ వీడియో చూడ‌టానికి స‌ర‌దాగా ఉన్నా, ఈ స్టంట్ మాత్రం ప్రమాదకరమైనదని నెటిజ‌నుల‌కు హెచ్చ‌రిక కూడా ఉంది. పొర‌పాటున గొర్రె అతని పైన‌ దాడి చేస్తే మనిషి తలకు గాయం అయ్యే అవకాశం ఉంది. "మేక వెనుకకు లాగితే, హెడ్‌బట్‌లు పుర్రెను పగులగొడతాయి" అని ఒక వినియోగదారుడు ట్వీట్ చేశారు.


Similar News