పులితో దొంగా పోలీస్ ఆట‌.. చివ‌ర‌కు దొంగ దొరికాడా..?! (వీడియో)

ఎలా మాయ‌మ‌య్యిందో తెలియ‌క పులి బిక్క మొహంతో దిక్కులు చూస్తుంది. Duck Plays Hide And Seek With Tiger.

Update: 2022-06-09 12:05 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః నిప్పుతో చెల‌గాటం, పులితో గేమ్స్.. రెండూ డేంజ‌రే! అందులోనూ ఆకలితో ఉన్న పులిని తోక ప‌ట్టి లాగితే, లాగిపెట్టి ఒక పంజా దెబ్బ వేస్తుంది. ఎవ‌రికైనా వ‌ణుకుపుట్టించే ఇలాంటి పులితో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడ‌ట‌మంటే మాట‌లా..?! కానీ, ఎంత స‌ర్ప‌మైన చ‌లి చీమ‌ల చేతగుట్టి చ‌చ్చిపోతుంద‌న్న‌ట్లు, ఓ పులి కొల‌నులో బాతుకు లోక‌వ‌య్యింది. ఏకంగా పులితోనే దొంగా పోలీస్ ఆటతో ఆటాడించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 10-సెకన్ల చిన్న క్లిప్‌కు 2.5 మిలియన్ కంటే ఎక్కువ వ్యూవ్స్ వ‌చ్చాయి. ఇందులో, ఓ బాతును నోట క‌రుచుకోడానికి పులి వెంట‌బ‌డుతుంది. పులిని ద‌గ్గ‌ర వ‌ర‌కూ రానిచ్చి, ఆ బాతు వెంట‌నే నీటి లోప‌లికి మునిగిపోతుంది. ఇంత‌లోనే ఆ బాతు ఎలా మాయ‌మ‌య్యిందో తెలియ‌క పులి బిక్క మొహంతో దిక్కులు చూస్తుంది. ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీరూ చూడండి..


Similar News