సెలూన్‌కి వెళితే, నెత్తి పగలగొట్టిన బార్బర్..ఎందుకో చూడండి (వీడియో)
నషాళానికి ఎక్కిన కోపంతో ఆ బార్బర్ గుండు పగలగొడతాడు. A Barber Slaps Customer For Funny Hilarious Reason.
దిశ, వెబ్‌డెస్క్ః సెలూన్‌కి వెళ్లి జుట్టు కత్తిరించుకోవడం, హెయిర్ స్టైలిష్‌గా చేసుకోడం తెలిసిందే. కొందరు మసాజ్ కూడా చేయించుకుంటారు. మసాజ్‌లో తలపై నెమ్మదిగా కొడుతుంటే హాయిగానే ఉంటుంది. కానీ, ఈ వీడియోలో ఒక బార్బర్ తన కస్టమర్‌ని నెత్తి పైన కొట్టే ఒక ఫన్నీ సీన్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెమె పేజీలో షేర్ చేశారు. వీడియోలో, హెయిర్‌కట్ కోసం తన సెలూన్‌కి వచ్చిన కస్టమర్ మెడకు కవర్ పెట్టిన తర్వాత, బార్బర్ ఆ వ్యక్తికి హెయిర్‌కట్ చేయడానికి తలపాగా తీయగానే, అక్కడ చేయడానికి ఏమీ కనిపించదు. నున్నని గుండును చూసి, నషాళానికి ఎక్కిన కోపంతో ఆ బార్బర్ గుండు పగలగొడతాడు. ఒక్కటి పీకి, బయటకెళ్లమని నెట్టేస్తాడు. ఈ సరదా సన్నివేశాన్ని వీడియో తీస్తున్న కస్టమర్ స్నేహితుణ్ని కూడా బయటకి నెడతాడు. తన సమయాన్ని వేస్ట్ చేసినందుకు బార్బర్‌కి కోపం వచ్చినా, వీడియో చూసే వారికి మాత్రం భలే నవ్వొస్తుంది. మీరూ చూడండి.