Dengue Home Remedy: డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవాలంటే.. ఈ డ్రింక్స్‌ తీసుకుంటే చాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి పెరిగింది

Update: 2023-10-06 06:39 GMT

దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి పెరిగింది. వర్షాకాలం తర్వాత ఈ డెంగ్యూ వ్యాధి చాలా మందిని ఎటాక్‌ చేస్తుంది. ప్రతి 10 మందిలో 6 గురు ఈ జ్వరంతో బాధ పడుతున్నారు. ఇంత వరకు ఈ వ్యాధికి సరయిన చికిత్స లేదు. కాబట్టి, వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స గురించి ప్రతి యొక్కరు తెలుసుకోవాలి. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. గత రెండు నెలలు నుంచి ప్రజల్లో మలేరియా, లెప్టోస్పిరోసిస్, కామెర్లు వంటి కేసులు పెరుగుతున్నాయి. వీటి లక్షణాలు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు,విరేచనాలు, వాంతులు, దగ్గు, వాసన, రుచి లేదా గొంతు నొప్పి వంటి అదనపు లక్షణాలు చాలా మందిని బాధిస్తున్నాయి. డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. దాని కోసం ఈ డ్రింక్స్ తీసుకోవడం అవసరం. అవేంటో ఇక్కడ చూద్దాం..

పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతి రోజూ రాత్రి గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పండ్ల రసాలు: పండ్ల రసాలు మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. నారింజ, నిమ్మ, బొప్పాయి వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్ల రసాలను రోజూ తీసుకోవడం వలన మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలోవెరా జ్యూస్: రోగ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్న కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన శరీరంలో మంట తగ్గుతుంది.

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు

Tags:    

Similar News