డయాబెటిస్‌ను కంట్రోల్ చేయాలంటే ఈ ఏడు సూత్రాలు పాటిస్తే చాలు.. 400 ఉన్న షుగర్ 100కు రావడం పక్కా..
ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్ధాల అలవాటు వలన పెద్దలలోనే కాకుండా పిల్లల్లో కూడా షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ బారిన పడుతున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్ధాల అలవాటు వలన పెద్దలలోనే కాకుండా పిల్లల్లో కూడా షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ బారిన పడుతున్నారు. అదేవిధంగా, ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోయినా లేదా సరిగ్గా పని చేయకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉండవు. దీనివల్ల మధుమేహం, ప్రీ-డయాబెటిస్, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహంతో పాటు, ఇన్సులిన్ నిరోధకత కొలెస్ట్రాల్ స్థాయిలు, థైరాయిడ్ పనితీరు, రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం ద్వారా ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను నిర్వహించవచ్చు.. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..
ఏడు సూత్రాలతో డయాబెటిస్ కు చెక్..
మెంతులు – ధనియాల నీరు:
1/2 టీ స్పూన్ మెంతి గింజలు, 1 టీ స్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటుంది.
ఉసిరి – అలోవెరా జ్యూస్:
ఉసిరి, కలబంద రెండు ఇన్సులిన్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పానీయంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి, పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.
సరైన పద్ధతిలో ఆహారాన్ని తినండి:
రోజు ప్రారంభంలో ఫైబర్.. ఆ తర్వాత ప్రోటీన్.. చివరకు పిండి పదార్థాలు వంటివి మితంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటుంది.
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం:
శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, చికెన్, బాదం, కాజు వంటివి తినండి. అలాగే రోజులో ఏదైనా భోజనంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటెయిన్ అవుతుంది.
దాల్చిన చెక్క నీరు:
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో మరిగించి రోజులో ఏదో ఒక పూట ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పుష్కలంగా నీరు త్రాగండి:
ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి రోజంతా 3-4 లీటర్ల నీరు తాగాలి.. దీనివల్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు
రాత్రి భోజనం తర్వాత నడవండి:
రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకూడదు. కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు నడవండి. ఇది ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.