ఏం దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం దాన ధర్మాలు చేయడం అనేది పూర్వకాలం నుంచే ఉంది.

Update: 2023-05-14 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం దాన ధర్మాలు చేయడం అనేది పూర్వకాలం నుంచే ఉంది. కొంతమంది ఎంత ధనవంతులైనప్పటికీ దానం చేయడానికీ అస్సలు ముందుకు రారు. కానీ కొందరు రోడ్డు పక్కల అడుక్కునేవారికి, అనాథ ఆశ్రయాల్లోని పిల్లలకు నిత్యం దానం చేస్తూ ఉంటారు. కాగా.. ఏయో దానాలు చేస్తే ఏం ఫలితం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

దాన ధర్మ నియమాలు..

* దాన ధర్మాల్లో కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. సూర్యస్తమయం తర్వాత దానం చేయకూడదు. ఒకవేళ ఆ సమయంలో చేసినట్లయితే ధనాన్ని పోగోట్టుకుంటారు.

* చీకటి పడిన తరవాత పెరుగును దానం చేయడం వల్ల ఫ్యామిలీలో సంతోషం తగ్గుతుంది.

* అలాగే రాత్రి సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.

* సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేస్తే విష్టుమూర్తికి, లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

ఏం ఏం దానం చేయాలి..

* కన్యాదానం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది.

* బంగారాన్ని దానం చేయడం ద్వారా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

* అలాగే గుర్రం దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి చేకూరుతుంది.

* ఏనుగును దానంగా ఇస్తే శివలోక సాన్నిధ్యము, ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ, నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ దక్కుతుంది.

* భూదానం చేయడం వల్ల శివలోక నివాసం, ఎద్దును దానం ఇస్తే మృత్యుంజయ లోకంలో జన్మ, గోవుని దానంగా ఇవ్వడం ద్వారా వైకుంఠ నివాసంలో జన్మించడానికి అవకాశం ఉంటుంది.

Also Read..

శృంగారాన్ని పడక గదిలో ఒకే భంగిమలో చేస్తున్నారా..? ఇక అంతేనా..?

Tags:    

Similar News