మీ స్నేహితులకు వీటిని గిఫ్ట్ గా ఇస్తే.. డబ్బు సమస్యలు తీరిపోతాయి

మీ స్నేహితులకు వీటిని గిఫ్ట్ గా ఇస్తే.. డబ్బు సమస్యలు తీరిపోతాయి

Update: 2024-07-08 15:17 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఆనందం, పాజిటివ్ ఎనర్జీ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఒక వేళ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే మొదలు పెట్టిన పనులేవి ముందుకెళ్ళవు.. మధ్యలోనే ఆగిపోతాయి. ఇవి వాస్తు దోషాన్ని కలిగిస్తాయి. మీరు, ఇతరులకు గిఫ్ట్ లు ఇవ్వడం వల్ల కూడా మీ జీవితంలో సంతోషం, డబ్బు సమస్యలు తీరిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, వాస్తు శాస్త్రంలో వేటిని బహుమతిగా ఇస్తే మంచి జరుగుతుందో ఇక్కడ చూద్దాం..

గణేశ విగ్రహం

వాస్తు ప్రకారం, ఇంటి ప్రవేశద్వారం వద్ద గణేష్ విగ్రహాన్ని ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అడ్డంకులు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. పండుగ అయినా గణేశుడు పూజ చేసాకే ఏ పని అయినా మొదలు పెడతారు. అదృష్టం, శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి, ఎవరికైనా వినాయక విగ్రహాన్ని గిఫ్ట్ గా ఇవ్వడం చాలా మంచిదని నమ్ముతారు.

వాస్తు యంత్రం

వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు యంత్రం ఇంటి నుండి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. వాస్తు దోషాన్ని తొలగించడానికి వాస్తు యంత్రం కూడా ఉపయోగపడుతుంది. ఇంటిని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉంచడం వల్ల జీవితంలో కష్టాలు తొలగుతాయని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు వాస్తు శాస్త్ర నిపుణులు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News