అలాంటి వారిలో బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు.. చికిత్స ఏంటో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. 2020లో 1 కోటి మందికి పైగా ప్రజలు క్యాన్సర్ కారణంగా మరణించారు.

Update: 2024-10-06 14:04 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. 2020లో 1 కోటి మందికి పైగా ప్రజలు క్యాన్సర్ కారణంగా మరణించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్. చాలామంది వీటి బారిన పడి అవస్తలు పడుతుంటారు. క్యాన్సర్ కణాలను ఆలస్యంగా గుర్తించడం కూడా చికిత్సను ఆలస్యం చేసి, మరణానికి దారి తీస్తుంది. వాటిలో ఒకటి మెదడు క్యాన్సర్, ఇది అత్యంత ప్రమాదకరం. అందుకే ఈ క్యాన్సర్ ని ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. మరి ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మెదడు క్యాన్సర్ లక్షణాలు, చికిత్స..

మెదడు క్యాన్సర్ లక్షణాలు అనేక రకాలుగా ఉండవచ్చు. కానీ చాలా సాధారణ లక్షణాలు అవి ఏంటంటే తలనొప్పి, ఇది ఉదయం ఎక్కువగా వస్తుంటుంది. ఇతర లక్షణాలు వాంతులు, చూపు మందగించడం, నడవడానికి, మాట్లాడటానికి ఇబ్బంది, శరీరం ఒక సగం తిమ్మిరి ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అలాంటి వారిలో బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు..

ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడేవారిలో కూడా మెదడు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. దీని నివారణ సాధ్యమే. ఇది ప్రధానంగా కణితి పరిమాణం, స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించగలిగితే మంచిది. లేకపోతే రేడియేషన్ థెరపీ, కెమోథెరపీ, ఇతర రకాల వైద్యం అందిస్తారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News