Fig froots: రోగ నిరోధక శక్తిని పెంచే అంజీర్.. పరిగడుపున తింటే ఎన్ని లాభాలో!
Fig froots: రోగ నిరోధక శక్తిని పెంచే అంజీర్.. పరిగడుపున తింటే ఎన్ని లాభాలో!
దిశ, ఫీచర్స్ : ఉదయంపూట అలసట వేధిస్తోందా? అయితే పరిగడుపున రోజుకో అంజీర్ (అత్తిపండు) తిన్నా.. వారం రోజుల్లో ఆ సమస్య దూరం అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయని చెప్తున్నారు. కొంచె వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు కలగలిసినట్లు ఉండే అంజీర్‌ను పండుగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, డ్రై ఫ్రూట్‌గానూ తినవచ్చు. ఇందులో అన్ని రకాల విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో రోగ నిరరోధక శక్తిని పెంచడం ద్వారా అనేక అనారోగ్యాలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
అధిక రక్తపోటును, అధిక బరువును తగ్గించడంలోనూ అంజీర్ పండు సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సోడియం, పిండి పదార్థాలు, కొవ్వులు కూడా తక్కుగా ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా విటమిన్ సి, జింక్ వంటి ఖనిజాలు కలిగి ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ పెంచడం ద్వారా దగ్గు, జ్వరం, జలుబు వంటి సీజనల్ అనారోగ్యాలను నివారించడంలో అంజీర్ పండు సహాయపడుతుంది. అయితే దీనిని ఉదయం ఖాళీకడుపుతో తినడం ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయి. అలా కాకుండా అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా తినవచ్చు. ఎండిన అంజీర్ అయితే నీటిలో నానబెట్టి తింటే బాగుంటుంది. కాగా కిడ్నీ స్టోన్స్, కడుపునొప్పి, లివర్ సమస్యలు, మైగ్రేన్‌తో బాధపడేవారు మాత్రం తినవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.