ఆడపిల్లలకు కచ్చితంగా ఈ 5 విషయాలు నేర్పించండి..!!

ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-06 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నేటికాలంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. కాగా శారీరకంగా, మానసికంగా పిల్లల్ని మార్చే బాధ్యత మీదే కాబట్టి ఇవి తప్పకుండా నేర్పించండి. 1. ఆత్మరక్షణ 2. నో చెప్పడం నేర్పండి. 3. గౌరవించుకోమనండి. 4. మానసికంగా దృఢంగా 5. టెక్నాలజీ రక్షణగా.

కామాంధుల క్రూరమృగాల చేతిన చిక్కకుండా ఉండాలంటే ఆడవాళ్లను స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దాలి. కాగా వారిని పోరాటయోధులుగా తయారుచేయాలి. దీంతో వారు జీవితాంతం ధైర్యంగా జీవిస్తారు. అలాగే ఆత్మరక్షణ నేర్పించండి. కేవలం కరాటే మగవారికే కాకుండా ఆడపిల్లలకు కూడా తప్పక నేర్పించాలి. దీంతో వారు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటార. పిల్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. బాడీ కూడా బలంగా తయారవుతుంది. కరాటే వల్ల పక్కవారిని కూడా రక్షించవచ్చు.

వీటితో పాటు మీ పిల్లలకు నో చెప్పడం అలవాటు చేయండి. ఇష్టం లేని పనిని నేను చేయనని ఎదుటివారితో ధైర్యంగా చెప్పేలా తీర్చిదిద్దండి. ఇష్టం లేకుండా జస్ట్ ఎవరైనా టచ్ చేసినా చాలు.. నో అని గట్టిగా చెప్పేలా ప్రిపేర్ చేయండి. అలాగే ఆత్మ గౌరవం గురించి మీ బిడ్డకు వివరించండి. కష్టాల్లో కూడా మానసికంగా దృఢంగా ఉండేలా.. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. టీనేజీ ఆడపిల్లల పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించండి. వారు ఎక్కడికెళ్తోన్న తమ లైవ్ లొకేషన్ షేర్ చేయించుకోండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News