Dengue Symptoms: బీఅలర్ట్.. జ్వరంతో పాటు ఈ డేంజరస్ లక్షణాలు కనిపిస్తున్నాయా?

వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం రావడం సర్వసాధారణం.

Update: 2024-07-30 09:46 GMT

దిశ, ఫీచర్స్: వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం రావడం సర్వసాధారణం. అలాగే దోమల బెడద కూడా ఎక్కువవుతుంది తద్వారా డెంగ్యూ ఫీవర్ వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని తాజాగా బసిర్‌హత్ హెల్త్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ చీఫ్ హెల్త్ ఆఫీసర్ భట్టాచార్య హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తికి డెంగ్యూ మోసే దోమ కుడితే.. అతడికి తప్పకుండా ఆరు రోజుల్లో డెంగ్యూ ఫీవర్ వస్తుందని చెబుతున్నారు. ఇందులో స్టెరైల్ ఏడిస్ దోమ కుడితే మాత్రం ఆ డెంగ్యూ జ్వరం ఇతరులకు కూడా వ్యాప్తిస్తుందంటున్నారు. అయితే కర్షాకాలంలో జ్వరం ఒక్కటే కాదు.. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం..

* డెంగ్యూ జ్వరం సంకేతాలు

చర్మం కింద, ముక్కు , చిగుళ్ళు , దంతాల నుంచి, నోటి నుంచి, కఫం, వాంతులు రక్తం, శరీరంలోని పలు భాగాల నుంచి రక్తస్రావం మలం లేదా నల్లటి మలంలో బ్లడ్ రావడం, కంటి నుంచి బయటికి రక్తం కారడం, మహిళలు ఎక్కువగా ఋతుస్రావం అవ్వడం లేదా దీర్ఘకాలం రక్తస్రావం కావడం వంటివి డెంగ్యూ లక్షణాలు.

దీంతో శరీరమంతా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. చిన్న పిల్లలు అయితే నొప్పి భరించలేక తరచూ ఏడుస్తుంటారు. కాగా వర్షాకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఎడ్చినా లేదా చికాకు పడినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి.. పరీక్షలు చేయించండి. పెద్దలు తరచూ తలనొప్పిగా అనిపించినా, కీళ్ల నొప్పి,తుంటి, కండరాల్లో తీవ్రమైన నొప్పి కలిగితే వైద్యుడి దగ్గరకు వెళ్లండి. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ శరీరంలోని తీవ్రమైన నొప్పులను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పల్లెల్లో, పట్టణ ప్రాంతాల్లోని పెద్ద పెద్ద భవనాల దగ్గర దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మురికి వాడలో నివసించే జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. పైన లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే కనుక ప్రాణాలకే ముప్పని హెచ్చరిస్తున్నారు.

గమనిక:గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News