Idiot syndrome: అనారోగ్యాలకు ఇంటర్నెట్‌లో పరిష్కారం వెతుకుతున్నారా..? మీలో ఈ సమస్య ఉండవచ్చు!

Idiot syndrome : అనారోగ్యాలకు ఇంటర్నెట్‌లో పరిష్కారం వెతుకుతున్నారా..? మీలో ఈ సమస్య ఉండవచ్చు

Update: 2024-10-08 12:58 GMT

దిశ, ఫీచర్స్ : తల గిర్రున తిరుగుతోందా ? .. కారణమేంటి? పరిష్కారం ఏమిటి? గొంతులో నొప్పిగా అనిపిస్తోందా? ఎలా తగ్గుతుంది? ఏ మెడిసిన్ వాడాలి? గుండెలో దడ మొదలయిందా? ఎందుకలా జరుగుతుంది? ఇలాంటి సందేహాలన్నీ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వైద్య నిపుణులనో, ఫార్మసిస్టులనో సంప్రదించడం ద్వారా పరిష్కారం కనుగొంటారు. కానీ కొందరు ఇంటర్నెట్‌‌ సెర్చింగ్ ద్వారా అనారోగ్య లక్షణాలు, ప్రభావాలను తెలుసుకోవడం, సొంతంగా మెడిసిన్ తెచ్చుకొని వాడటం వంటివి చేస్తుంటారు. ఇక్కడ డాక్టర్లకు బదులు ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడటం కొందరిలో వ్యసనంగా మారుతోందని నిపుణులు చెప్తున్నారు. దీనినే ‘ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ (Idiot syndrome) అని పేర్కొంటున్నారు.

అనారోగ్య లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించడానికి బదులు ఇంటర్నెట్‌ సెర్చింగ్‌పై ఆధారపడి మందులు వాడటం, సొంతంగా వైద్యం చేసుకోవడం తెలివైన పని ఏమాత్రం కాదని, పైగా అది ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారంతో అనారోగ్యాలను పోల్చుకొని తప్పుగా అన్వయించుకునే ‘ఇడియట్ సిండ్రోమ్’ బాధితులు తర్వాత అవస్థలు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే నేటి ఇంటర్నెట్ యుగంలో నమ్మదగిన సమాచారం కూడా నెట్‌లో ఉంటుంది. దానిని అవగాహన కోసం ఉపయోగపడుతుంది తప్ప, అర్హత కలిగిన డాక్టర్లకు లేదా వైద్య చికిత్సకు మాత్రం ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ‘క్యూరియస్’లో స్టడీ కూడా స్పష్టం చేసింది. కాబట్టి ప్రతీ అనారోగ్య సమస్యకు ఇంటర్నెట్ సెర్చ్ చేసే ‘ఇడియట్ సిండ్రోమ్’ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా సాధ్యం కాని పక్షంలో మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అవసరం. 

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Similar News