Iceland : ఒక్క దోమ కూడా లేని దేశం ఇదే..! కారణం ఏంటంటే..
Iceland : ఒక్క దోమ కూడా లేని దేశం అదే..! కారణం ఏంటంటే..
దిశ, ఫీచర్స్ : దోమలు.. ఈ పేరు వింటేనే మనం భయపడతాం. అవి కుడితే మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయని ఆందోళన చెందుతాం. కాబట్టి రాత్రిళ్లు అవి కుట్టకుండా దోమ తెరలు, కాయిల్స్, ఆలౌట్స్ వంటివి వాడటం చేస్తుంటాం. అయితే ఇలాంటి ఏ ఇబ్బందులు లేని దేశం కూడా ఒకటుందని మీకు తెలుసా? ఎందుకంటే అక్కడ ఏ సీజన్‌లోనూ దోమలు ఉండవట. ఆ దేశం మరేదో కాదు.. ఐస్‌లాండ్.
మిగతా ప్రపంచంతో పోలిస్తే ఐస్‌లాండ్‌లో భిన్నమైన వాతావరణం ఉంటుంది. అయితే ఇక్కడి కఠినమైన వెదరే దోమలు లేకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వింటర్ సీజన్ ముగిశాక సహజంగానే ఎక్కడైనా మరో సీజన్ (వేసవి) మొదలవుతుంది. ఐస్‌లాండ్‌లో మాత్రం ఇది ముగిశాక జస్ట్ 40 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ చలికాలమే ప్రారంభం అవుతుంది. దీంతో కరుగుతున్న మంచు నీరుగా మారుతుంది. ఎక్కువకాలం ఈ వాతావరణం చక్రం కొనసాగడం, మంచు కరిగి నీరు ప్రవహిస్తూ ఉండటం వంటి వాతావరణం మధ్య దోమలు పుట్టి, మనగలిగే అవకాశం అసలుకే లేకుండా పోయాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఫ్రాన్స్‌లో, శ్రీలంకలో కూడా దోమలు లేవని చెప్తుంటారు. కానీ కచ్చితమైన సమాచారం లేదు. మొత్తానికి ఐస్‌లాండ్ అయితే ఒక్క దోమ కూడా లేని దేశంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాగా ఈ దేశంలోని వాతావరణం దోమలమనుగడను నిరోధిస్తున్నప్పటికీ, దాని పొరుగు దేశమైన గ్రీన్ ల్యాండ్, ఇతర యూరోపియన్ దేశాల్లో మాత్రం దోమలు బాగానే ఉంటున్నాయి.