SCHOOL FEE: హైదరాబాద్ LKG స్కూల్ ఫీజు వైరల్.. ఈ వ్యాపారం ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా వేస్ట్ ..
విద్య.. వ్యాపారం అయిపోయిందని చెప్తూ సినిమాలు బాగానే వచ్చాయి. నిజ జీవితంలో మనం చూస్తున్నాం కూడా. పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో చదువు చెప్పించడం
దిశ, ఫీచర్స్ : విద్య.. వ్యాపారం అయిపోయిందని చెప్తూ సినిమాలు బాగానే వచ్చాయి. నిజ జీవితంలో మనం చూస్తున్నాం కూడా. పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో చదువు చెప్పించడం గగనమే అవుతుంది. అయినా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అప్పు తెచ్చి మరీ చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా ఇది అందని ద్రాక్షలాగే ఉందంటూ ఓ బెంగళూరు ఇన్వెస్టర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
'LKG ఫీజు హైదరాబాద్‌లో రూ. 2.3లక్షల నుంచి 3.7లక్షల వరకు పెరిగింది, ఇది జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. మేము ఇళ్ల ధరలపై దృష్టి కేంద్రీకరించగా, నిజమైన ద్రవ్యోల్బణం విద్యలో పెరిగింది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడింది, పాఠశాల ఫీజులు 9 రెట్లు పెరిగితే.. కళాశాల ఫీజులు గత 30 సంవత్సరాలలో 20 రెట్లు పెరిగాయి. ఇప్పుడు చదివించేంత స్థోమత లేదు' అని రాసుకొచ్చాడు. అందుకే చాలా మంది పిల్లలను కనేందుకు వెనుకడుతున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. కానీ ఆ కాలేజీలు, పాఠశాలల్లో చదువు చెప్పే గురువులు మాత్రం పల్లీలు అమ్ముకునే వాళ్ళకన్నా తక్కువ సంపాదిస్తున్నారని అంటున్నారు.