100 దాటి బతుకుతామా? సాధ్యాసధ్యాలపై అధ్యయయనం ఏం చెప్తుందంటే...

150 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించే వ్యక్తి ఇప్పటికే జన్మించాడని 2000 సంవత్సరంలో అంచనా వేయబడింది. 20వ శతాబ్దంలో వైద్యపరమైన పురోగతి ఆయుర్దాయం పెరగడానికి దారితీస్తుందనే విశ్వాసం నుంచి అలాంటి ధైర్యమైన ప్రకటన వచ్చింది.

Update: 2024-10-11 14:53 GMT

దిశ, ఫీచర్స్ : 150 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించే వ్యక్తి ఇప్పటికే జన్మించాడని 2000 సంవత్సరంలో అంచనా వేయబడింది. 20వ శతాబ్దంలో వైద్యపరమైన పురోగతి ఆయుర్దాయం పెరగడానికి దారితీస్తుందనే విశ్వాసం నుంచి అలాంటి ధైర్యమైన ప్రకటన వచ్చింది. కానీ గత మూడు దశాబ్దాల్లో ఆయుర్దాయం పెరుగుదలలో భారీ మందగమనం ఉందని తాజా విశ్లేషణ చెప్తోంది. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన జనాభా నుంచి మరణ డేటాను విశ్లేషించిన తర్వాత ఇలాంటి రిజల్ట్ తో ముందుకు వచ్చింది.

మెరుగైన ప్రజారోగ్య సదుపాయం, వైద్య ఆవిష్కరణల కారణంగా 20వ శతాబ్దంలో అధిక-ఆదాయ దేశాలలో ఆయుర్దాయం సుమారు 30 సంవత్సరాలు పెరిగింది. కానీ 21వ శతాబ్దంలో ఎక్కువ ఆయుర్దాయం ఉన్న ప్రాంతాల్లో పుట్టిన మగవారిలో ఐదు శాతం, ఆడవారిలో 15 శాతం మంది మాత్రమే 100 ఏళ్లకు చేరుకుంటారని అధ్యయనం తెలిపింది. 1990 నుంచి జీవిత కాలపు అంచనాలు క్షీణించాయిని.. జీవ వృద్ధాప్య ప్రక్రియలను గణనీయంగా తగ్గించకపోతే మానవ జీవిత పొడిగింపు ఈ శతాబ్దంలో అసంభవమని అభిప్రాయపడింది.

జపాన్, ఆస్ట్రేలియా, అనేక యూరోపియన్ దేశాల్లోని దీర్ఘాయువు ప్రాంతాల్లో డేటాను విశ్లేషించారు పరిశోధకులు. 1990 నుంచి 2019 వరకు మరణాల డేటాపై జరిపిన అధ్యయనం ఈ కాలంలో ఆయుర్దాయం కేవలం 6.5 సంవత్సరాలు పెరిగినట్లు కనుగొంది. 1990 నుంచి మెరుగుదలలో క్షీణత ఉందని.. USలో వాస్తవానికి ఆయుర్దాయం తగ్గిందని గుర్తించింది. మెరుగైన రిజల్ట్ సాధించాలంటే .. యాంటీ ఏజింగ్ థెరపీలలో పురోగతి, వయస్సు-సంబంధిత వ్యాధులకు విరుద్ధంగా కొత్త మందులు అవసరమని చెప్తున్నారు. ప్రజలు 100 సంవత్సరాల వరకు జీవిస్తారని భావించవద్దని.. అందుకే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే వందేళ్ల వరకు ఉంటామని అనుకోవద్దని అంటున్నారు.

Tags:    

Similar News