కంప్యూటర్‌తో గేమ్.. ఎక్కువ కష్టపడుతున్న మెదడు

ఇప్పుడు అవుట్‌డోర్ ప్లేయింగ్ కంటే ఆన్‌లైన్ గేమ్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

Update: 2023-04-12 10:21 GMT
కంప్యూటర్‌తో గేమ్.. ఎక్కువ కష్టపడుతున్న మెదడు
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: ఇప్పుడు అవుట్‌డోర్ ప్లేయింగ్ కంటే ఆన్‌లైన్ గేమ్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వర్చువల్‌గా స్నేహితులతో లేదంటే కంప్యూటర్‌తో ఆడుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్‌ను ఓడించడం వల్ల పొందే సంతృప్తికరమైన అనుభూతి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఓడిపోవడం కంటే మంచిదని అంటున్నారు పరిశోధకులు. పైగా మనుషులతో కంటే మెషీన్స్‌తో ఆడుతున్నప్పుడు మన మెదడు మరింత హార్డ్‌ వర్క్ చేయాల్సి వస్తుందని తెలిపారు.

ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో.. ఇతర వ్యక్తులు, యంత్రాలకు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆడడాన్ని గమనించారు. ఆటగాళ్ళు వారి మెదడు కార్యకలాపాలను మ్యాప్ చేసే ఎలక్ట్రోడ్‌లను ధరించారు. ఈ క్రమంలో మనుషులు మనుషులతో ఆడుతున్నప్పుడు వారి మెదళ్లు.. అందరూ ఒకే భాష మాట్లాడుతున్నట్లుగా ఏకగ్రీవంగా ఉన్నట్లు కనుగొనబడితే.. మెషీన్‌కు వ్యతిరేకంగా పోటీ పడినప్పుడు మెదడులోని న్యూరాన్‌లు డీసింక్రనైజ్ చేయబడ్డాయి. అంటే అవి మానవులతో ఆడుతున్నప్పుటి మాదిరిగా ఒకే విధంగా లేవని గుర్తించారు. అంటే ఆ మెషీన్‌తో సింక్రనైజ్ అయి గెలిచేందుకు మెదడు ఎక్కువగా కష్టపడుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. కానీ అనేక సందర్భాల్లో కంప్యూటర్ గెలవడమే చూస్తుంటాం. ఆటగాళ్లు నిరాశ పడటం గమనించే ఉంటాం. అందుకే కంప్యూటర్‌తో కాకుండా మనుషులతో ఆడుకోవడం మానసికంగా ఆరోగ్యాన్నిస్తుందని తెలిపారు పరిశోధకులు.

Also Read..

బిర్యానీతో శరీరానికి అందే పోషకాలు ఎన్నో తెలుసా..? 

Tags:    

Similar News