Inspirational story: ఇల్లు లేదు.. బిల్లు లేదు.. సముద్రంలో తేలియాడడం కోసం ఆస్తులు అమ్మేసిన కుటుంబ కథ ఇది!

Inspirational story: నేటికాలంలో జీవితాన్ని తమకు నచ్చినట్లుగా ఆస్వాదించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Update: 2025-03-27 04:39 GMT
Inspirational story: ఇల్లు లేదు.. బిల్లు లేదు.. సముద్రంలో తేలియాడడం కోసం ఆస్తులు అమ్మేసిన కుటుంబ కథ ఇది!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Inspirational story: నేటికాలంలో జీవితాన్ని తమకు నచ్చినట్లుగా ఆస్వాదించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే చాలా మంది ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో చిక్కుకుని వెనకడుగు వేస్తున్నారు. కొంతమంది మాత్రం వీటిని దాటుకుని ముందుకెళ్తుంటారు. మాజీ భారత నావికాదళ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, అతని భార్య మీడియా ప్రొఫెషనల్ వైదేహీ చిట్నిస్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమ ఉద్యోగాలను వదిలేసి.. ఆస్తులను అమ్మేసి పిల్లలతోపాటు సెయిల్ బోట్ లో జీవించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో వారి ప్రయాణం గురించి తెలుసుకుందామా?

రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్..ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహీ చిట్నావిస్, వారి కుమార్తె రియా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు. పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించేందుకు ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను వదులుకున్నారు. దాదాపు ఆస్తులన్నీ అమ్మేశారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్ లో ఏదొక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యే విధంగా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్ స్టా అకౌంట్లో షేర్ అయిన వీడియో వైరల్ అయ్యింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచింది.

భారత నావికాదళంలో ఏళ్లు గడిపిన గౌరవ్ కు సముద్రంతో విడదీయలేని బంధం ఉంది. వైదేహి కూడా చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలోనే 2015లో గౌతమ్ కొచ్చి నుంచి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. అప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఓ ఆలోచన వచ్చింది. భార్య,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న, ప్రయాణించే అనేకు కుటుంబాలు వారికి తారాసపడ్డాయి. దీంతో వారి ఆలోచనకు మరింత ప్రేరణ లభించింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత ఈ జంట చూడాల్సినవి..ఆస్వాదించాల్సినవి చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారి స్రుష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు కూడా మరింత ఆకర్షించాయి.

ఇక ఆలస్యం చేయకూడదు అనుకన్నారు. 2022లో గౌతమ్ నావీ వీఆర్ఎస్ తీసుకున్నారు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరు వదులుకున్నారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయమ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ఆస్తులన్నీ అమ్మేశరు. ఇంటి సామానును 6వేల కిలోల నుంచి 120 కిలోల వరకు తగ్గించేశారు.

పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వ్రుధా అనుకున్నారు. 2 క్యాబిన్లు, వంటగది, 9 కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్, ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుతల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని పలు మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన ద్రుక్పథంతో ముందుకు సాగుతున్నారు.

అయితే పడవపై ఎలా బతుకుతారన్న సందేహం రావచ్చు. ఏడాదిలో దాదాపు 70శతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసుకుని గడుపుతారు. మిగతా అన్ని సమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది. వంతులవారీగా బోటునడపడం వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం లాంటిపనులు చేసుకుంటారు. అప్పుడప్పుడు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండలను వాడుతుంటారు.

ఎక్కడికైనా వెళ్లినా సముద్రం మీదే. అయితే వాతావరణ నావిగేషన సమస్యలు వీరికి పరీక్ష లాంటివి. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా..కాలక్రమేణా ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్స్, వాతావరణ హెచ్చరికల వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనావేడయంలో వారు రాటు దేలారు. అయితే వారి పడవ రీవా 760 వాట్ల సోలార్ ప్యానెల్స్ తో ఛార్జ్ చేసిన 800 ఏహెచ్ బ్యాటరీ ద్వారా నడుస్తూనే ఉంటుంది. పడవ తొందరగా తుప్పు పట్టదు. దీనికి విండ్ జనరేటర్ కూడా ఉంది.

ఇక మలేషియాలోని పెనాంగ్ లో ప్రారంభమైన వీరి సముద్ర ప్రయాణం లంకావీ థాయిలాండ్ కు చేరుకున్నారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారాలపాటు సేదతీరారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్, డైవింగ్ చేస్తూ కొత్త ఇల్లులో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుంచి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారింది.

ప్రస్తుతం ఆ కుటుంబం తమ ప్రయాణంలో అపారమైన సంత్రుప్తిని పొందుతుంది. వారి కథ వేలాది మందితో ప్రతిధ్వనించింది. ఇందుకు నిదర్శనం వారికి పెరుగుతున్న సోషల్ మీడియానే ఉదాహరణ. ఇన్ స్టాగ్రామ్ లో 8వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. వీరి ఇన్ స్టాగ్రామ్ లో మనం వీడియోలు చూస్తుంటే మనకు సమయమే తెలియదు. 

Read More..

పాము విషంతో రూ. కోట్లలో బిజినెస్  




Tags:    

Similar News