ఖాతాదారులకు గుడ్ న్యూస్: డెబిట్ కార్డు లేకున్నా ATM లో డబ్బులు డ్రా ఎలా చేయాలంటే..! (వీడియో)

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. అందరూ చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు.

Update: 2023-09-07 15:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. అందరూ చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. ఎంత పెద్ద పని అయినా చిటికెలో చేతిలో ఉండే మొబైల్ ఫోన్‌తో కానిచేస్తున్నారు. పెద్ద పెద్ద లావాదేవీల నుంచి షాపింగ్‌ల వరకు కూడా అందరూ ఫోన్‌లే ఉపయోగిస్తున్నారు. చేతిలో ఎవరు క్యాష్ మెయింటైన్ చేయడం లేదు. కానీ, కొన్ని సార్లు లిక్విడ్ క్యాష్ కావాల్సి వస్తుంది. అప్పుడు ATM దగ్గరకు వెళ్లి తీసుకుందాం అనుకుంటారు. కానీ, డెబిట్ కార్డులు ఇంటిలో మర్చిపోయి ఉంటారు.

మరి ఎలా..? అని ఆలోచిస్తున్నారా.. అంతగా చింతించాల్సిన అవసరమే లేదు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది కదా. డెబిట్ కార్డుతో ఏ మాత్రం పని లేకుండా మీ చేతిలో ఉండే మొబైల్‌తో ATM నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చట. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు ఆనంద్ మహీంద్రా. ‘‘సెప్టెంబర్ 5న ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో ఈ UPI ATM స్పష్టంగా ఆవిష్కరించబడింది. భారతదేశం ఆర్థిక సేవలను డిజిటలైజ్ చేస్తోంది. దాంతో పాటు కార్పొరేట్-సెంట్రిక్‌కి (క్రెడిట్ కార్డ్ కంపెనీలకు అలారం బెల్?) కాకుండా వాటిని యూజర్-సెంట్రిక్‌గా వేగంగా మార్చడం సులభం’’ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.

Tags:    

Similar News