సమ్మర్‌లో గ్రేప్స్ తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే..

సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ గ్రేప్స్ మన డైట్‌కు ఎక్స్‌ట్రా న్యూట్రిషన్స్ అందిస్తాయి. కానీ సరిగ్గా క్లీన్ చేయకుండా తినేస్తే మాత్రం రోగాల బారిన పడటం ఖాయమని

Update: 2024-04-03 05:58 GMT

దిశ, ఫీచర్స్: సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ గ్రేప్స్ మన డైట్‌కు ఎక్స్‌ట్రా న్యూట్రిషన్స్ అందిస్తాయి. కానీ సరిగ్గా క్లీన్ చేయకుండా తినేస్తే మాత్రం రోగాల బారిన పడటం ఖాయమని రీల్స్, షాట్స్ రోజూ చూస్తునే ఉన్నాం. బ్యాక్టీరియా, పంటకు యూజ్ చేసిన పెస్టిసైడ్స్, కెమికల్స్ వాటిపై అలాగే ఉండిపోతాయని.. కడగకుండా తీసుకుంటే హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వీటిని ఎలా శుభ్రపరచాలని పలు సూచనలు అందిస్తున్నారు నిపుణులు.

నీటిలో రాక్ సాల్ట్, బేకింగ్ సోడా, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని క్లీనింగ్‌కు వినియోగించాలని చెప్తున్నారు. ఈ సొల్యూషన్‌లో ఏడు నిమిషాలపాటు గ్రేప్స్‌ను నానబెట్టి.. తర్వాత మళ్లీ నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. బేకింగ్ సోడా, రాక్ సాల్ట్ పండ్లపై ఉన్న కెమికల్స్ తొలగించేందుకు ఉపయోగపడితే.. వెనిగర్ బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అయితే ఈ టెక్నిక్ సైంటిఫిక్‌గా నిరూపించబడలేదని.. మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకునేవారు స్పెషలైజ్డ్ ఫ్రూట్ వాష్‌ చూజ్ చేసుకోవాలి అంటున్నారు.

ఇక గ్రేప్స్ స్టోర్ చేయాలని అనుకుంటే సరిగ్గా ఆరబెట్టాల్సి ఉంటుంది. లేదంటే అధిక తేమ కారణంగా అవి చెడిపోయే ప్రమాదముంది. కాబట్టి ముందుగా వాటిని వాష్ చేసి టవల్‌తో తుడిచాకే స్టోర్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. హోల్స్ కలిగిన ప్లాస్టిక్ కంటైనర్ లేదా పాక్షికంగా మూసి ఉండే కంటైనర్స్ స్టోరేజీకి బెటర్ ఆప్షన్స్. కాగా ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ కోసం రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుచుకుని.. బెటర్ టేస్ట్ కోసం త్వరగా తినేయడమే మంచిదని చెప్తున్నారు.


Similar News