పండ్లతో అందాన్ని పెంచుకోండి ఇలా?
పండ్లతో ఆరోగ్యమే కాదండోయో.. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చునంట. అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. చాలా మంది అందగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే మన ముఖసౌందర్యాన్ని పెంచడంలో
దిశ, ఫీచర్స్ : పండ్లతో ఆరోగ్యమే కాదండోయో.. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చునంట. అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. చాలా మంది అందగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే మన ముఖసౌందర్యాన్ని పెంచడంలో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయంట. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా మెరిసే అందం మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
1. ముఖం మీద మచ్చలు ఏర్పడటం చాలా కామన్. ఫేస్ మీద మచ్చలు అనేవి చూడటానికి కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంటుంది. ఇక ఏదైనా పార్టీలేద, ఫంక్షన్స్‌కు వెళ్లడానికి ఇంట్రెస్ట్ రాదు. అందువలన ఫేస్ మీద ఉన్న నల్లటి మచ్చలు పోవాలంటే. ఒక అరటి పండును మెత్తగా చేసుకొని, అందులో చెంచా పెరుగు, పసుపు వేసి పేస్టులా కలపాలంట. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి,15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగడం వలన నల్లటి మచ్చలు మాయం అవుతాయంట. అయితే దీన్ని వారానికి రెండు సార్లు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.
2. నారింజ గుజ్జులో పసుపు, తేన వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఫేస్‌కు అప్లై చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం నిగారింపుగా ఉండటమే కాకుండా, వృద్ధ్యాప్య ఛాయలు రాకుండా ఉంటుంది.
3. దోసకాయ ముక్కలను పేస్టులా చేసుకొని, అందులో కాస్త తేనె, బ్రౌన్ షుగర్ వేసుకొని మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖాని అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేస్తే అందంగా కనిపిస్తారు.