బీచ్‌ల్లోనే ఆ ఫీలింగ్ ఎందుకు..? శబ్దాలు, వాసనతోనేనా..?
సాధారణంగా వాటర్ ఫాల్స్, నదులు, కొలనుల దగ్గర ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడిన అనుభూతి కలుగుతుంది.
దిశ, ఫీచర్స్: సాధారణంగా వాటర్ ఫాల్స్, నదులు, కొలనుల దగ్గర ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడిన అనుభూతి కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వివరించడం కష్టం కానీ నీటి చుట్టూ ఉండటం వల్ల ఈ అమేజింగ్ ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. నీటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనం మనకంటే పెద్దదానిలో భాగమైనట్లు అనిపిస్తుంది. సొంత ఆలోచనలకు పోకుండా సాంఘిక ప్రవర్తనలను ప్రోత్సహిస్తుంది. గొప్ప సంతృప్తి పొందేలా సహాయపడుతుంది. అలాగే మనం ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తామో అనేదానికి పంచేంద్రియాలు చాలా ముఖ్యమైనవి. అందుకే నీటి ఇంద్రియ ప్రభావాలు మన మనస్సుపై అంత ప్రభావాన్ని చూపుతాయి. దృశ్యాలు, శబ్దాలు, నీటి వాసనలు ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. సముద్రపు గాలి, అలలు చిన్నతనంలో బీచ్‌లో గడపడం వంటి సంఘటనలను గుర్తుచేస్తూ.. సంతోషకరమైన, స్పష్టమైన జ్ఞాపకాలను ప్రేరేపించగలదు. మన మనస్సులను నిశ్శబ్దం చేయడానికి అనుమతించే కల లాంటి గుణాన్ని కలిగి ఉంటుంది.
Also Read.. నవజాత శిశువుల బ్రెయిన్‌లో ప్రత్యేక సిగ్నల్.. నాలుగు నెలలకే ఆ పని స్టార్ట్ చేస్తున్న పిల్లలు!