Home Tips : మీ పొట్ట పదే పదే బెలూన్ లా ఉబ్బిపోతుందా.. అయితే ఇలా చేయండి..

పొట్ట సంబంధిత సమస్యలలో అత్యంత సాధారణమైన సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ సమస్య ఉంటుంది.

Update: 2024-08-16 09:08 GMT

దిశ, ఫీచర్స్ : పొట్ట సంబంధిత సమస్యలలో అత్యంత సాధారణమైన సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ సమస్య ఉంటుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండడం, వేయించిన, కాల్చిన, కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం మొదలైన అనేక కారణాలు దీనికి ఉండవచ్చు.

కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి అసౌకర్యానికి గురవుతారు. ఛాతీలోకి గ్యాస్ ప్రవేశిస్తే, ఛాతీలో బిగుతు, విశ్రాంతి లేకపోవడం. గ్యాస్ కారణంగా, ఛాతీ నొప్పి, బర్నింగ్ సెన్సేషన్, ప్రిక్లింగ్ సెన్సేషన్ కూడా అనిపించవచ్చు. ప్రజలు గ్యాస్ సమస్యను వదిలించుకోవడానికి మందులు తీసుకుంటారు. కానీ ఎక్కువ మందులు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. అలా కాకుండా కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.

కడుపులో గ్యాస్ ఎలా ఏర్పడుతుంది ?

కడుపులో గ్యాస్ ఏర్పడటం అనేది ఒక సాధారణ ప్రక్రియ. మనందరి కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ సమస్య పెరగడం ప్రారంభించినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలి. కడుపులో గ్యాస్ ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. కార్బోహైడ్రేట్ ఆహారం, పానీయాలు కూడా దీనికి కారణం కావచ్చు.

భోజనం చేసేటప్పుడు ఈ పొరపాటు చేయకండి..

కొందరికి భోజనాలు చేసే సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు కాబట్టి తినే సమయంలో నీళ్లు తాగకుండా ఉండాలి.

ఈ వస్తువులను తీసుకోవడం తగ్గించండి..

మన శరీరానికి తగినంత పీచుపదార్థం లభించనప్పుడు మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి మొదలైన సమస్యలు మొదలవుతాయి. దీనిని నివారించడానికి, మనం ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవడం, అలాగే బంగాళాదుంపలు, బియ్యం, బ్రెడ్, స్వీట్లు, శీతల పానీయాలు మొదలైన అధిక పిండిపదార్థాలను నివారించడం చాలా ముఖ్యం.

గ్యాస్ నుండి తక్షణ ఉపశమనం..

అమ్మోనియం క్లోరైడ్ అంటే నౌసాదార్ మీకు గ్యాస్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం మీరు గ్రాముకు సమానమైన నౌసాదార్‌ను ఒక గ్లాసు నీటిలో పూర్తిగా కరిగించి తాగాలి. మీరు రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నిమిషాల తర్వాత ఈ రెమెడీని చేయవచ్చు. మీకు అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నట్లయితే సాదార్‌ను నీటిలో కరిగించి, అందులో సగం నిమ్మకాయ రసం పిండి, త్రాగాలి.

మరిన్ని పద్దతులు...

గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎప్పుడూ తినే సమయంలో ఆహారాన్ని సరిగ్గా నమలాలి. అంతే కాకుండా సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News