వైరస్‌లను గుర్తించే మాస్క్.. నిమిషాల్లో ఫోన్‌కు హెచ్చరిక

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్ మాస్క్ యూజ్ చేస్తాం కానీ ఇప్పుడు అదే ఫేస్ మాస్క్ గాలిలోని వైరస్‌లను కనిపెట్టేలా డెవలప్ చేశారు సైంటిస్టులు.

Update: 2022-09-30 11:16 GMT

దిశ, ఫీచర్స్: వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్ మాస్క్ యూజ్ చేస్తాం కానీ ఇప్పుడు అదే ఫేస్ మాస్క్ గాలిలోని వైరస్‌లను కనిపెట్టేలా డెవలప్ చేశారు సైంటిస్టులు. కరోనా వైరస్, ఫ్లూతో సహా అన్ని వైరస్‌లను గుర్తించగలిగే ఈ ఫేస్ మాస్క్‌.. లిక్విడ్ లేదా గ్యాస్‌లో అతి తక్కువ సాంద్రతల్లో కూడా వైరస్‌లను గుర్తించగలదు. అనేక అంటు వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడే 'ముందస్తు హెచ్చరిక వ్యవస్థ'గా పనిచేయగలదు.

మాస్క్ ఎలా పని చేస్తుంది?

ఇది గాలిలోని సాధారణ శ్వాసకోశ వైరస్‌లను డ్రాప్లెట్స్ లేదా ఏరోసోల్స్‌లో గుర్తించగలదు. అంటే కొవిడ్-19 లేదా H1N1 (స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు) వంటి వ్యాధులు సోకిన వ్యక్తులు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వ్యాప్తి చెందిన వైరస్‌లు కొంత కాలం పాటు గాలిలో ఉండిపోతాయి. వాటిని కూడా ఈజీగా పసిగట్టే మాస్క్.. వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఎలివేటర్లు లేదా మూసివున్న గదుల వంటి పేలవమైన వెంటిలేషన్ ప్రదేశాలలో కూడా బాగా పని చేస్తుంది.


శాస్త్రవేత్తల బృందం ఆప్టామర్‌లతో ఒక చిన్న సెన్సార్‌ను రూపొందించింది. ఇది వ్యాధికారకాల యొక్క ప్రత్యేకమైన ప్రోటీన్‌లను గుర్తించగల ఒక రకమైన సింథటిక్ అణువు. కాగా శాస్త్రవేత్తలు ఇందుకోసం మూడు రకాల ఆప్టామర్‌లను ఉపయోగించారు. ఇవి SARS-CoV-2, H5N1, H1N1 యొక్క ఉపరితల ప్రోటీన్‌లను గుర్తించగలవు. ఆప్టామర్‌లు టార్గెట్ ప్రొటీన్‌లను బైండ్ చేసిన తర్వాత మాస్క్ సెన్సార్‌పై ట్రాన్సిస్టర్ ట్రిగ్గర్ చేయబడుతుంది. దీంతో మాస్క్ ధరించిన వారి ఫోన్‌కు 10 నిమిషాల్లో హెచ్చరిక పంపబడుతుంది. మూసివేసిన గదిలో మాస్క్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలు.. వైరస్‌ల యొక్క ట్రేస్-లెవల్ మొత్తాలను మాత్రమే కలిగి ఉన్న వైరల్ ఉపరితల ప్రోటీన్‌ను మాస్క్‌పై స్ప్రే చేశారు.

సెన్సార్ వైరస్ ప్రోటీన్‌లను కలిగి ఉన్న 0.3 మైక్రోలీటర్ల ద్రవంతో కూడిన నమూనాలను గుర్తించింది. ఇది ఒక తుమ్ములో ఉత్పత్తి అయ్యే ద్రవ పరిమాణం కంటే 70 నుంచి 560 రెట్లు తక్కువగా ఉంటుంది. దగ్గు లేదా మాట్లాడటం ద్వారా ఉత్పత్తి అయ్యే వాల్యూమ్ కంటే చాలా తక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఇక కొత్త శ్వాసకోశ వైరస్‌లు ఉద్భవించినట్లయితే.. వాటిని గుర్తించడానికి మాస్క్‌ను సులభంగా అప్‌డేట్ చేయొచ్చన్నారు.

ఇవి కూడా చదవండి : ముక్కుపై బ్లాక్ అండ్ వైట్ మచ్చలను ఇలా చెక్ పెట్టండి

Tags:    

Similar News