Heart attack : రోజూ ఈ పనులు చేయండి.. గుండెపోటు రిస్క్ 80 శాతం తగ్గుతుంది!
Heart attack : రోజూ ఈ పనులు చేయండి.. గుండెపోటు రిస్క్ 80 శాతం తగ్గుతుంది!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికమంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. ఒకప్పుడు ఏజ్ బార్ అయిన వారిలోనే ఈ ప్రాబ్లం కనిపించేది కానీ.. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలు కొని పెద్దల వరకు దీనిబారిన పడుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. శారీరక శ్రమ తక్కువగా లేదా పూర్తిగా లేని జీవనశైలి, ఆహారాపు అలవాట్లు, వాతావరణ కాలుష్యాలు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. ప్రధానంగా సిరల్లో, ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం కారణంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే కొన్ని జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
* శరీరంలో కొవ్వు శాతం పెరగడం, అది ధమనులు లేదా సిరల్లో అడ్గుగా మారడం గుండెపోటుకు దారితీస్తుంది. అయితే కొవ్వు శాతం పెంచగలిగే ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటి అన్ని రకాల జంక్ ఫుడ్స్‌ను అవైడ్ చేయాలి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తాజా పండ్లు, గుడ్లు, చేపలు, బాదం వంటివి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*నిశ్చల జీవనశైలి కూడా అధిక కొవ్వు పెరుగుదలకు కారణం అవుతుంది. ధమనుల్లో ఆటంకంగా మారిన కొవ్వు కరిగిపోవాలంటే ప్రతిరోజూ వ్యాయామాలు లేదా తగినంతగా శారీరక శ్రమ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి డైలీ రన్నింగ్, జాగింగ్, స్వి్మ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేస్తూ ఉండాలి.
* ధూమపానం, మద్య పానం కూడా ఊపిరితిత్తులను, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో ఉండే రసాయనాలు రక్తంలో కలిసి రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు, మధుమేహానికి కారణం అవుతుంది. పరోక్షంగా ఉండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
* రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తరచుగా చెక్ చేసుకోవడంవల్ల వాటిని కంట్రోల్ చేసుకోవడంపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అధిక బరువు, హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే శరీరంలోని అధిక కొవ్వు సమస్య దూరం అవుతుంది. ధమనుల్లో, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. జీవనశైలిలో సానుకూల మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం ద్వారా అధికొవ్వుతో సంభవించే గుండె జబ్బుల ప్రమాదాన్ని 80 శాతం వరకు నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.