Healthy Life: ఎవరూ చెప్పరు.. మీరే పాటించాలి.. లేకపోతే..!

Healthy Life: ఎవరూ చెప్పరు.. మీరే పాటించాలి.. లేకపోతే..!

Update: 2024-10-07 13:40 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు ఎవరూ చెప్పరు. కానీ మనమే పాటిస్తుంటాం. అలా పాటించకపోతే నష్టపోతాం కూడా. టైమ్‌కు తినడం, మందులు వేసుకోవడం, ఆఫీస్‌కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం, వ్యక్తిగత, సామాజిక, వృత్తి జీవితాలను సమతుల్యం చేసుకోవడం.. ఇవన్నీ ప్రతీసారి ఎవరో వచ్చి నేర్పించరు. ఒకసారి వినడం ద్వారానో, గ్రహించడం ద్వారానో, పరిశీలించడం ద్వారానో మనకు మనం నేర్చుకోవాలని, మెరుగైన ఆరోగ్యం కోసం అనుసరిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* లైఫ్ బ్యాలెన్సింగ్, స్ట్రెస్ మేనేజ్ మెంట్, మెంటల్ హెల్త్ మనిషికి చాలా ముఖ్యం. అలాగే ఆరోగ్య కరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా. వీటిని పాటించాలని, తెలుసుకోవాలని ఒకటి రెండుసార్లు ఎవరైనా చెప్తుండవచ్చు. తప్ప ఎల్లప్పుడూ ఎవరూ చెప్పరు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరూ చెప్పినా చెప్పకపోయినా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

* అనేక ఆరోగ్య, మానసిక సమస్యలకు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా ప్రధానమైన కారణాల్లో ఒకటి. ఆహారాన్ని తప్పుగా వాడినా, అవసరం అయినప్పుడు మందులు వేసుకోకపోయినా మీరు మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి వాటిని ఎవరూ చెప్పకపోయినా, సరైన సమయానికి, సరైన విధంగా మీరు పాటించి తీరాలి. లేకపోతే ఇబ్బందులు పడుతార అంటున్నారు నిపుణులు.

* మధుమేహం, పీసీఓఎస్, థైరాయిడ్ వంటి సమస్యలను ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే బాధితులకు డాక్టర్లు తరచుగా చెప్పని విషయాలు కూడా ఉండవచ్చు. అవి మీకు మీరే పాటించాలి. ఏంటంటే.. ఆ వ్యాధులకు కారణమయ్యే అలవాట్లను మార్చుకోవడం, అవసరం లేని వాటిని మానుకోవడం, ఆరోగ్య కరమైన జీవన శైలిని అలవర్చుకోవడం వంటివి మీకు మీరు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. డాక్టర్ల సలహాలు, చికిత్సలు మెరుగ్గా పని చేయాలన్నా ఇక్కడ మీరు మారాలి.

* ఫలానా ఆహారం తింటే మంచిదని, అలా ఉంటే మంచిది కాదని కొందరు చెప్తుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి. ఒకరికి ఆరోగ్యకరమైన ఆహారం మరొకరికి అనారోగ్యమో, అలెర్జీలో కలిగించే చాన్స్ ఉండవచ్చు. కాబట్టి మీ అనుభవాన్ని, మీ శారీరక లక్షణాలను, మీకు డాక్టర్ ఇచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకోండి. ఆయుర్వేదం ప్రకారం కూడా.. వాత, పిత్త, కఫాలు.. రుమాటిక్ బాడీ టైమ్ కలవారు.. ఎక్కువ వెజిటేబుల్స్, తక్కువ కార్బో హైడ్రేట్స్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. మరి కొందరు తక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ కార్బో హైడ్రేట్స్ తీసుకుంటనే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మి ఆహారపు అలవాట్లను ఫాలో అవ్వొద్దు అంటున్నారు నిపుణులు.

* అనారోగ్యాల బారిన పడినప్పుడు డాక్టర్ల సలహా మేరకు మందులు వాడాలి. అంతే తప్ప ప్రతీ చిన్న సమస్యకు కూడా కొందరు టాబ్లెట్స్ మింగేస్తుంటారు. ఈ విషయంలో ఎవరూ కాదని చెప్పడానికి ఉండదు. మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు వాడుతున్నారని అనుకుంటారు. అయితే దీర్ఘకాలం మందులు వినియోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని తెలుసుకోండి. అవసరం లేనప్పుడు, అలాగే అవసరం లేని మందులు వాడితే కాలేయం దెబ్బతినవచ్చు. శ్వాస ఆడకపోవడం, రక్తహీనత, గుండె జబ్బులు వంటివి డెవలప్ కావచ్చు. బీ కేర్ ఫుల్.

* కొందరికి మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉంటాయి. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ల వద్దకు వెళ్తే వారు మీ అనారోగ్యాన్ని నయం చేసే మందులు సూచిస్తారు. కానీ మీ చెడు అలవాట్లు మానుకోమని చెప్పకపోవచ్చు. అసలు మీరు వారికి ఈ విషయం తెలిపి ఉండకపోవచ్చు. కాబట్టి మీకు మీరే జాగ్రత్తలు పాటించండి. ఆల్కహాల్, మెడికేషన్స్ ఒకేసారి వాడుతూ ఉంటే దుష్ప్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు, ప్రిజర్వేటివ్‌లు, కలరింగ్ ఏజెంట్స్, కెమికల్స్, సువాసనలు జోడించబడతాయి. కాబట్టి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మీరు ఫలానా స్వీట్లు, ఫలానా చిప్స్ తినవద్దని ప్రతిరోజూ వచ్చి ఎవరూ చెప్పరు. ఒకసారి తెలిశాక మంచి ఆరోగ్యం కోసం మీకు మీరే ఆహార నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు. ఇలా అనేక విషయాల్లో హాని చేసే వాటిని అవైడ్ చేస్తూ, మేలు చేసే వాటిని అనుసరించడం బాధ్యతగా ఫీలై ఆచరిస్తే ప్రయోజనం. ఎందుకంటే ఈ విషయాలను ప్రతిరోజూ డాక్టర్లు గానీ, నిపుణులు గానీ, స్నేహితులు గానీ వచ్చి చెప్పరు.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More : ఆ నొప్పి కూడా గుండెపోటు లక్షణమా.. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.


Similar News