Health Tips : డైట్ పాటిస్తున్నా ఆ సమస్యలు వస్తున్నాయంటే.. మీరు చేస్తున్న తప్పులివే!
Health Tips : డైట్ పాటిస్తున్నా ఆ సమస్యలు వస్తున్నాయంటే.. మీరు చేస్తున్న తప్పులివే!
దిశ, ఫీచర్స్ : ఇటీవల చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కొందరు ఈజీగా వెయిట్ పెరుగుతున్నారు. కానీ తగ్గడానికి మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. ఎందుకంటే అధిక బరువు అనేక రోగాలతో ముడిపడి ఉంటుంది. అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, గుండె జబ్బులకు ఇది కారణం అవుతుంది. ఇలా జరగకూడదంటే వెయిట్ లాస్ అవ్వడమే చక్కటి పరిష్కారం. అందుకోసం కొందరు డైట్ పాటించడంతోపాటు వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు మీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుండవచ్చుఅంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.
* డైట్ పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గడం లేదంటే మీరు రాత్రి భోజనంలో అధిక కార్బొహైడ్రేట్లు తీసుకుంటూ ఉండవచ్చు. చాలా మంది ఈవిషయాన్ని గుర్తించరు. ఎందుకంటే సాధారణ ఆహారమే తింటున్నాం అనుకుంటారు. కానీ మీరు తినే ఆహారంలో అధిక చక్కర స్థాయిలు అధిక కార్బొహైడ్రేట్లు ఉండి ఉంటాయి. ఇలాంటప్పుడు ఎన్ని వ్యాయామాలు చేసినా, పగలు ఎంత డైట్ పాటించినా ఫలితం ఉండదంటున్నారు నిపుణులు.
*ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని కొందరు గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే మీ శరీర తత్వాన్ని బట్టి వ్యాయామం ఎంత సేపు అవసరం అనేది తెలుసుకొని పాటిస్తే మంచిది. అంతే తప్ప బరువు తగ్గాలని అధిక వ్యాయామాలు చేసినంత మాత్రాన తగ్గరు. పైగా ఎక్కువసేపు చేయడంవల్ల కండరాలు మరింత బాలాన్ని పొందుతాయి. దీంతో మరింత బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. అధిక ఒత్తిడి కూడా వెయిట్‌లాస్ అవ్వకుండా అడ్డుపడుతుంది.
*రాత్రిపూట ఆలస్యంగా తినేవారు కూడా ఎంత చక్కటి డైట్ పాటించినా అధిక బరువు తగ్గే చాన్స్ ఉండదు అంటున్నారు నిపుణులు. పైగా రోజూ ఇలాంటి దినచర్య కలిగి ఉండి, ఉదయంపూట వ్యాయామాలు చేసినా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి రాత్రిళ్లు మరీ ఆలస్యంగా తినవద్దు. అలాగే నాణ్యమైన నిద్ర, రోజు మొత్తంలో సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం, అవసరం మేరకు వ్యాయామాలు వంటివి మీ దిన చర్యలో భాగమైతే ఊబకాయం లేదా అధిక బరువు సమస్యను నివారించడంలో అవి సహాయపడతాయి. రోజూ మెట్లు ఎక్కి దిగడం కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Health: ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టె ఈ ఆకు గురించి తెలుసా?