Spicy Food : ఆయుష్షు పెంచుతున్న స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్ రుచికరమైనది మాత్రమే కాదు పోషకాలు కలిగినది కూడా అంటున్నారు నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సహాయం చేస్తుందని చెప్తున్నారు. దీనివల్ల కలిగే
దిశ, ఫీచర్స్: స్పైసీ ఫుడ్ రుచికరమైనది మాత్రమే కాదు పోషకాలు కలిగినది కూడా అంటున్నారు నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సహాయం చేస్తుందని చెప్తున్నారు. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ గురించి వివరిస్తే కచ్చితంగా మీరు కూడా ఈ స్టైల్ ఆఫ్ ఫుడ్ కు కన్వర్ట్ అయిపోతారని అంటున్నారు. ఇంతకీ స్పైసీ ఫుడ్ వల్ల ఎలాంటి లాభాలున్నాయి? ఎందుకు అంత ఇంపార్టెంట్? తెలుసుకుందాం.
దీర్ఘాయువు
హెల్త్ జర్నల్ ప్రకారం స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఆయుష్షు పెరుగుతుంది. మసాలా ఆహారంలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి రక్తప్రవాహం పెంచడంలో సహాయం చేస్తుంది. కార్డియోవాస్క్యులర్ హెల్త్ పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. గుండె సంబంధిత జబ్బుల నుంచి కాపాడుతుంది.
జీవక్రియ
మిరియాలలో ఉండే క్యాప్సైసిన్ సమ్మేళనం వాటిని ఘాటుగా మారుస్తుంది. ఇది కొవ్వును విచ్ఛిన్నం చేసి, ఎక్కువ శక్తిని బర్న్ చేసేలా శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ.. జీవక్రియ తరచుగా మందగిస్తుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువ స్పైసీ ఫుడ్ చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేట్ పెరిగేలా చేస్తుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది.
ఆకలి తగ్గుదల
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రధాన సమస్య ఉబకాయం. కాగా స్పైసీ ఫుడ్ చక్కని పరిష్కారం అని చెప్తున్నాయి అధ్యయనాలు. మిరియాలలో ఉండే క్యాప్సైసిన్ ఆకలి అణిచివేసే గుణాన్ని కలిగి ఉండటం. త్వరగా స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది. బరువు తగ్గాలని అనుకున్నవారికి హెల్ప్ అవుతుంది. ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు సాయపడుతుంది.
డిప్రెషన్ నుంచి విముక్తి
మసాలా ఆహారం తీసుకున్న తర్వాత బాడీ ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు విడులయ్యే న్యూరో ట్రాన్స్ మీటర్లు. కాగా నొప్పి, ఒత్తిడిని తగ్గిస్తాయి. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సహాయపడుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు స్పైసీ ఫుడ్ కు ప్రయారిటీ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
Note: ఈ సమాచారం పలు అధ్యయనాల ఆధారంగా సేకరించబడినది.