బంతిపువ్వులో అనేక ఔషధగుణాలు.. అవేంటో చూసేద్దామా..

సాధారణంగా మనం పూజకు, అలంకరణకు ఉపయోగించే బంతి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

Update: 2024-10-05 12:00 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : సాధారణంగా మనం పూజకు, అలంకరణకు ఉపయోగించే బంతి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఈ పువ్వులు, ఆకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మేరిగోల్డ్ పువ్వులో దాగి ఉన్న ఔషధ మూలకాలు వ్యాధులతో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు.

ఈ పువ్వులో దాగి ఉన్న అనేక ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాతన కాలంలో ప్రజలు పువ్వులు, ఆకులను ఔషధంగా ఉపయోగించారు. మేరిగోల్డ్ ఫ్లవర్ కూడా వాటిలో ఒకటి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించేవారు. చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

మేరిగోల్డ్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మేరిగోల్డ్ పువ్వులలో యాంటీ ఫంగల్, యాంటీ-అలెర్జీ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలతో పాటు క్యాన్సర్, ట్యూమర్‌ల వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడడంలో సహాయపడతాయి.

బంతి పువ్వులలో విటమిన్ ఎ, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఇది ముఖ్యంగా జుట్టు రాలడం, చుండ్రు, తలలో ఫంగస్ వంటి జుట్టు సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని కారణంగా జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది.

వైద్య నిపుణుల ప్రకారం చుండ్రును తొలగించడానికి బంతి పువ్వులు, వేప ఆకులను ఉపయోగించడం సహజమైన మార్గమని చెబుతున్నారు. దీనికోసం ఈ రెండింటిని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి, నీరు సగానికి తగ్గినప్పుడు, అందులో నూనె కలిపి తలకు పట్టించాలని చెబుతున్నారు.

మేరిగోల్డ్ పువ్వులు, దాని ఆకులలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకులను, కొబ్బరినూనెలో వేడి చేసి, చల్లారాక జుట్టుకు నూనెలా రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు అందంగా నిగనిగలాడుతుందంటున్నారు నిపుణులు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News