ఏకాగ్రతను పెంచడంలో అద్భుతంగా మేలు చేస్తోన్న సీమ చింతకాయ.. దీనిలో ఉండే పోషకాల విలువ తెలుసుకోండి

సీమ చింతకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి వరంలా భావిస్తారు

Update: 2024-09-25 08:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీమ చింతకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి వరంలా భావిస్తారు. కామన్‌గా చింతకాయ అంటే అందరికీ తెలుసు. కానీ సీమ చింతకాయ చాలా మందికి తెలిసి ఉండదు. ముఖ్యంగా సిటీలో ఉండేవారికి అస్సలు తెలియదు. గ్రామాల్లో ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికీ ఈ చింతకాయ గురించి తెలిసి ఉంటుంది.

సీమ చింతకాయకు మరో పేరు..

సీమ చింతకాయను మంకీ పాడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని పలు వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. సాస్, పచ్చళ్ళలో ఎక్కువగా వాడుతారు. చాలా వరకు అయితే పచ్చిగానే తింటారు. ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు హెల్త్‌కు కూడా చాలా మేలు చేస్తాయి. తీపి, పులుపు కలిగి ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు తింటే కొంచెం వగరుగా ఉంటుంది. కాస్త పక్వానికి వచ్చాక తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది.

మానసిక స్థితి , ఏకాగ్రతను పెంచుతుంది..

ఈ పండులో బరువు తగ్గించే మంచి గుణాలు ఉంటాయి. సీమ చింతలో ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ లాంటి ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి. ఇవి తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న, డిప్రెష‌న్‌, వంటి స‌మ‌స్య‌లకు చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, మానసిక స్థితి , ఏకాగ్రతను పెంచడంలో సీమ చింతకాయ ఎంతో మేలు చేస్తుంది.

షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి..

ఈ సీమ చింతకాయ తింటే రోగనిరోధకశక్తి పెంచుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. కానీ మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. సీమ చింత తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు.

డయేరియా సమస్యకు చెక్..

డయేరియా ప్రాబ్లమ్‌తో బాధపడేవారికి సీమ చింతకాయ అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతూనే ఉంటారు. దీనిలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి. అలాగే సీమ చింతకాయ కొమ్మను వాటర్‌లో మరిగించి తాగితే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో తోడ్పడుతుంది. ఫేస్‌పై పింపుల్స్ అండ్ నల్ల మచ్చల్ని తొలగిస్తుంది.

పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి మాయం..

సీమ చింతకాయలోని విటమిన్ సి పంటి నొప్పి, చిగుళ్ల నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే నోటి పూతలను నిర్వహించడానికి తోడ్పడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. సీమ చింతలో ఉండే పీచు తొందరగా డైజెషన్ అవ్వడానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News